
గతంలో మన ఆర్థిక పరిస్ధితి అత్యంత దయనీయంగా ఉన్న సమయంలో కుట్రతో ఇదే అదనుగా భావించి పాకిస్థాన్ చైనా పరస్పర సహకారంతో 1965 వ సంవత్సరంలో మనపై యుద్దానికి సిద్దమైంది.
అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు మన ప్రధాని స్పందించిన తీరు అద్భుతం. ఎందుకంటే కనీసం సైనికులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండే...కాని యుద్ద సామాగ్రి ని కొనుగోలు చెయ్యాలి, దేశ ప్రజల రక్షణ అన్నిటికన్నా ముఖ్యం అని భావించి లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశ ప్రజల నుండి విరాళాలు సేకరించాలనుకున్నారు.
ఆయన పిలుపుతో పేద ధనిక అన్న తేడా లేకుండా తమ దగ్గరున్న కొంత డబ్బును ఇచ్చారు. మన నటి సావిత్రి గారు ఐతే తన నగలన్ని విరాళంగా అందించారు. ప్రధాని శాస్త్రి గారు ఒక అడుగు ముందుకొచ్చి తన జీతంతో పాటు, ఒక్క పూట భోజనం మానేసి ఆ భోజన ఖర్చు కూడా విరాళం ఇచ్చారు.
అంతటి గొప్ప త్యాగంతో అలా దేశ ప్రజలందరూ ఒక్కటై యుద్ధం చేశారు.అప్పుడు అలా చేశారు కాబట్టే ఇప్పుడు మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నాం అని మనం తెలుసుకోవాలి.
ఇప్పుడు కూడా అవినీతి, నల్ల డబ్బు పై యుద్ధం జరుగుతుంది, మనల్నేమి మన డబ్బులు అడగడం లేదు. కేవలం మన సహకారాన్ని అడుగుతున్నారు. కొన్ని రోజులు ఓపికగా ఉండాలి. ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి కాని, మన దేశం ఎదుర్కుంటున్న సమస్యలతో పోలిస్తే అవి చాలా చిన్నవి. మన దేశం మారాలి నాయకులు మారాలి అని చెప్పడం మాత్రమే కాదు మన వంతుగా సహాయం కుడా అందించాలి.
-మన కామారెడ్డి