
రైతు బజార్ లో నగదు రహిత లావాదేవీలను ప్రయోగాత్మకంగా మార్కెటింగ్ శాఖ ప్రారంభించింది.
వినియోగదారులు ఆధార్ కార్డు నెంబర్ చెబితే వారు ఎంత విలువైన కూరగాయలు కొనుగోలు చేయదలచుకుంటే ఆ మేరకు 5,10,20 రూపాయల టోకెన్లు IDFC ఇస్తుంది. కొనుగోలు తర్వాత వారి బ్యాంక్ ఖాతా నుంచి ఆ డబ్బులు కట్ అవుతాయి. ఆధార్ కార్డు తప్పనిసరిగా దేశంలోని ఏదో ఒక బ్యాంకు తో అనుసంధానం కలిగి వుండాలి. ఆధార్ కార్డు వెంట తెచ్చు కోక పోయినా దాని నెంబర్ చెబితే సరిపోతుంది. అలాగే కూరగాయలు అమ్ముకునే రైతులకు వారి విక్రయాల మొత్తాన్ని వారి బ్యాంక్ ఎకౌంట్లో జమ అవుతుంది. వినియోగదారులు, ఇటు రైతులు, చిన్న తరహా వ్యాపారుల సౌకర్యం కోసం ఈ ప్రయోగం తెలంగాణలో మొదటిసారి చేశామని మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ లోని బోయినపల్లి రైతు బజార్ లో ప్రారంభించిన సంధర్భంగా తెలిపారు. మరో రెండు రోజులు ఈ లావాదేవీలను అధ్యయనం చేసి ఇతర రైతు బజార్లలోనూ అమలు చేస్తామన్నారు.