రాష్ట్ర ముఖ్యమంత్రి నూతన అధికారిక నివాస గృహప్రవేశం నేడు జరిగింది. ఈ తెల్లవారుజామున 5.22 గంటలకు సీఎం కేసీఆర్ గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి చినజీయర్‌స్వామితో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు.
గృహ ప్రవేశంలో భాగంగా దైవప్రవేశం, యతి ప్రవేశం, గో ప్రవేశం, నివసించే వారి ప్రవేశంను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ప్రస్తుత క్యాంపు కార్యాలయానికి సమీపంలోనే నూతన అధికారిక నివాస భవనాన్ని నిర్మించారు. రూ. 38 కోట్ల వ్యయంతో మూడు బ్లాకులుగా ఐదు భవనాల నిర్మాణం జరిగింది. ఈ భవనాల సముదాయానికి ప్రగతిభవన్గా నామకరణం చేశారు. వీటిలో వివిధ వర్గాలతో భేటీ అయ్యే సమావేశ మందిరానికి జనహిత పేరును పెట్టారు. దాదాపు వెయ్యి మందితో సమావేశమయ్యేలా మీటింగ్ హాల్ నిర్మాణం జరిగింది. ప్రాంగణమంతా పచ్చదనం వెల్లివిరిసేలా మొక్కలను నాటారు.
తెల్లవారుజామున గృహప్రవేశం కార్యక్రమాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం నూతన గృహంలో సర్వ మత ప్రార్థనలు జరిపించారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ద, జైన మత గురువులు కొత్త ఇంట్లో ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ దంపతులతోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.