ప్రధాన ఆలయంలో ఆ షిరిడి నాథుడు వెండి సింహాసనంపై ఆసీనులై వుంటారు. ఇక్కడి ఆలయంలోని సాయిబాబా విగ్రహం షిరిడిలో వున్న బాబా విగ్రహాన్ని పోలి ఉంటుంది. ఆలయం వద్ద సాయి ద్వారకామాయితో పాటు నవగ్రహ ఆలయం కూడా ఉంటుంది. అలాగే ఆలయం ఆవరణలో గోశాల కూడా ఉంటుంది. ఆలయం ముందు భాగాన దత్తాత్రేయ స్వారూపుడైన సాయి నాథుడి విగ్రహం భక్తులను ఏంతో ఆకట్టుకుంటుంది. అలాగే ఆలయం పరిసరాలు, ఉద్యానవనం ఆలయానికి విచ్చేసే భక్తులకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. సాయి సన్నిధి ఆలయాన్ని దర్శించుకోవటానికి ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులు వస్తుంటారు.
ఆలయంలో జరిగే పూజ కార్యాక్రమాలు:
- ప్రతి రోజు ఐదు సార్లు హారతి
- ప్రతి నెల మొదటి గురువారం సత్య సాయి వ్రతం.
- ప్రతి నెల పౌర్ణమి నాడు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు.
- ప్రతి గురువారం భక్తుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.
ఆలయానికి ఇలా చేరుకోవచ్చు..
కామారెడ్డి నుండి బాన్స్ వాడ చేరుకొని అక్కడి నుండి ఎనమిది కిలోమీటర్ల దూరంలో బోధన్ వెళ్ళే దారిలో ఆలయానికి చేరుకోవచ్చు.ఆలయ వీడియో:
Photo Credit: Saitemple.in