పచ్చని ప్రకృతి ఒక వైపు, పక్షుల కిలకిలరావాలు మరో వైపు, గలగల పారే సెలయేర్ల మధ్య వేలిసిందే శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం. కామారెడ్డి జిల్లా, మాచారెడ్డి మండలంలోని మద్దికుంట గ్రామంలో ఈ ఆలయం వుంది. ఎంతో మహిమగల ఈ ఆలయంలో జలబుగ్గను, శివ లింగాన్ని త్రేతా యుగంలో, సాక్షాత్తు శ్రీ రాముడే ప్రతిష్టించాడని ప్రతీతి. ప్రతి సంవత్సరం ఆలయ వార్షికోత్సవంలో భాగంగా (మహా శివరాత్రి) జాతర ఘనంగా జరుగుతుంది. ఉత్సవాలలో భాగంగా స్వామి వారికి రుద్రాభిషేకం, రథోత్సవం, అగ్ని గుండాలు మొదలగు కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. ఎంతో మహిమ కలిగిన ఈ ఆలయాన్ని ప్రతి సంవత్సరం భక్తులు వివిధ ప్రాంతాలనుండి వచ్చి పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుంటారు. ఆలయ ఆవరణలో అమ్మవారి ఆలయంతో పాటు, ఆంజనేయ స్వామి ఆలయం, పుణ్య స్నానాలు ఆచరించటానికి కోనేరు ఉంటుంది.
ఈ ఆలయానికి సంబంధించి చెప్పుకోవలసిన మరో గొప్ప విషయం 'నిత్యాన్నదాన కార్యక్రమం' ఆలయంలో గ్రామస్తుల సౌజన్యంతో సంవత్సరం పొడవున నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 2003 సంవత్సరంలో మహా శివరాత్రి నాడు ప్రారంభమైన నిత్యాన్నదాన కార్యక్రమం ఇప్పటికి విజయవంతంగా కొనసాగుతోంది. ఇంతటి ప్రాచుర్యం కలిగిన ఈ ఆలయాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి చేసి తగిన సౌకర్యాలు కల్పించవలసిన అవసరం ఎంతైనా వుంది.
![]() |
ఆలయంలో ఆవరణలో కోనేరు |
![]() |
స్వామి వారి రథం |
ఆలయానికి ఇలా చేరుకోవచ్చు:
కామారెడ్డి జిల్లా కేంద్రం నుండి మాచారెడ్డి స్ రోడ్డుకి టీఎస్ ఆర్టీసీ బస్సులో చేరుకొని అక్కడి నుండి అన్నారం మీదుగా ఆలయానికి ప్రైవేట్ వాహనాలలో చేరుకోవచ్చు.
1 comments:
Write commentsLike Page
Replyhttps://www.facebook.com/sribuggaramalingeshwaraswamy/?fref=ts