తెలంగాణ ఉద్యమ కారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని కామారెడ్డి కొత్త బస్టాండ్ దగ్గర ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపి బీబీ పాటిల్, రాజ్య సభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్తో పాటు వివిధ నాయకులు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని పద్మశాలి సంఘ భవనంలో ఏర్పాటు చేసిన సభలో వక్తలు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమంలో తొలి తరం నాయకుడు అని కొనియాడారు.