ఎవరెవరి దగ్గర బ్లాక్ మనీ ఉంది.. ఎవరి దగ్గర కోట్ల డబ్బు మూలుగుతుంది.. మీకు తెలిసుంటే చెప్పండి.. వివరాలు చాలా గోప్యంగా ఉంచుతామంటూ కేంద్ర ఆర్థిక శాఖ తీసుకొచ్చిన ఆఫర్ కు మంచి స్పందన లభిస్తోంది. Blackmoneyinfo@incometax.gov.in కు ఈ-మెయిల్ చేయాలని కోరింది కేంద్రం. ప్రకటన చేసిన 72 గంటల్లో వేల సంఖ్యలో ఈ-మెయిల్స్ వచ్చాయి. ఐడియా బాగా వర్కవుట్ అయ్యిందని.. జనం ఇస్తున్న సమాచారంతో ఐటీ దాడులను వేగవంతం చేస్తామని చెబుతున్నారు ఇన్ కం ట్యాక్స్ అధికారులు. లెక్కలో చూపించిన డబ్బుపై ఆర్థిక శాఖ నిఘా విభాగంతో ఇప్పటి వరకు దాడులు చేస్తున్నారు. ఇక నుంచి జనం ఇచ్చిన సమాచారం ఆధారంగానూ దాడులను ముమ్మరం చేస్తామని కేంద్రం చెబుతోంది.