గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ రావు గారికి హ్రుదయపూర్వక నమస్కారములతో,
ఉద్యమనేతగా, మంచి పరిపాలనదక్షుడుగా ఉన్న మీ ద్రుష్టికి ఒక తెలంగాణ పౌరుడిగా, టి.ఆర్.ఎస్ ని అభిమానించే వ్యక్తిగా కొన్ని విషయాలు తీసుకురాదల్చుకున్నాను. దీనిలో ఎమైన తప్పులుంటే పెద్ద మనసుతో క్షమించగలరు.
నిరంతర విద్యుత్,మిషన్ కాకతీయ,మిషన్ భగీరధ, ఆసరా, పల్లె వ్రుత్తులను పటిష్ట పరిచే అనేక కార్యక్రమాలు ఇప్పటికిప్పుడు ఫలితాలు చూపించకపొయిన భవిష్యత్ తెలంగాణ కు రూపురేఖలు మార్చే అవకాశాలు ఎక్కువ. ఈ పథకాల ముందు ఆ తర్వాత ప్రజల జీవన విధానం మీద మనం తప్పకుండ డాక్యుమెంట్ చెసుకొవాలి. ఎంతో కీలక సమయం లో ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన మీరు ఎన్నొ కుట్రలు చేదించి ప్రభుత్వ పథకాలు, సాగునీటి ప్రాజెక్ట్ లకు ఇబ్బందులు కలగకుండ చూసిన్రు.
తెలంగాణ సమాజం కొంతమంది ఇతర పార్టి సభ్యుల్ని గెలిపించిన తెలంగాణ అవసరాల ద్రుష్ట్య టి.ఆర్.ఎస్ లొ చెరినప్పుడు కూడ మకు పెద్దగా భాద అనిపియ్యలే కాని మూడెండ్ల తర్వాత కూడ తెలంగాణ లో కొత్త లీడర్ షిప్ ఎదగకుండ స్వార్ధ పరుల మెడలో కండువాలు మారటం కొంచెం బాధగా ఉంది. నియోజకవర్గాల్లో అటువంటి వారితో కలిసిపనిచేయలేని టి.ఆర్.ఎస్ కార్యకర్తల మానసిక వేధన ఒక సారి చూడండి.
ఇది అహోబిల మఠం కాదు అని తెల్సిన గతం లో పాలించిన పార్టిలకు భిన్నంగా మన టి.ఆర్.ఎస్ పార్టి ని నిర్మించుకొలేమా?. వ్యక్తిగతంగా శ్రీ కె.టి. రామారావు గారంటే ఇష్టం కాని రాజరిక పాలన లాగ 2019 లో ఆయన్ని ముఖ్యమంత్రి పీఠం లో కూర్చొపెట్టె దిశగా చర్చలకు తావిస్తు శ్రీ కె.టి.ఆర్ కేంద్రంగా పరిపాలన జరుగుతుంది అని ఆయన మీద అనేక ఆరోపణలు రావటం కూడ మాకు బాధనిపిస్తుంది. కనీసం నడవలేని వ్రుద్యాప్యం లో ఇబ్బందులు పడుతున్న ఎంతో మంది కి అధికారికంగా పదవులు కట్టబెట్టడం తెలంగాణ సమజానికి కొంతవరకు ఇబ్బంది అనిపిస్తుంది.
మీకున్న నిఘా వర్గాలు తప్పకుండ గ్రౌండ్ లెవెల్లొ జరిగే అవినీతి పై సమాచారం ఇచ్చె ఉంటాయి..ఇప్పటికి నిస్సిగ్గుగా గ్రామ పంచాయతి నుండి హైదరబాద్ లోని మన పరిపాలన భవనం వరకు అధికారులు చేతులు చాచటం మంచి పరిణామం కాదు. పిల్లలు చదువుకొనే బడుల పక్కన ఎన్ని బెల్ట్ శాప్ లు ఉన్నాయో చూస్తే మన అధికారుల పనితీరు తెలుస్తుంది. ఇదెంది అని అడిగితే సామాజిక వర్గాల సంఘాల దాడులు, ఫేక్ కేసుల పేరుతో మూకుమ్మడి బెదిరింపులు.
విదేశాల్లో కులసంఘాల గురించి తెగ బాధపడుతున్న మన ప్రజాప్రతినిదులు ఇక్కడెమి చేస్తున్నరో చెప్పల్సిన పనిలేదు. ఇప్పటికె వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన పాఠశాల భవనాల్ని వదిలి సామాజిక వర్గాల వారిగా బడుల్ని పెడితే కులరహిత సమాజం దిశాగా మనం ఎప్పుడు వెల్తాం.
మనల్ని తిట్టి, కొట్టించిన ఇతర పార్టిల నాయకులు పని ఉన్న లేకున్న మన నాయకుల వెంట దళారులుగా తిరగటం చూస్తుంటే పైసలు ఉన్నొడిదే రాజ్యం అనే భావన కలుగుతుంది.
గత కొంతకాలంగా కలిసిన చాలమంది మిత్రుల అభిప్రాయల్ని ఒకదగ్గర చేర్చి మీ ద్రుష్టికి తెచ్చె ప్రయత్నం.
ధన్యవాదములతో,
సుధీర్ జలగం
Source: TelanganaData