Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks
Showing posts with label News. Show all posts
Showing posts with label News. Show all posts

Thursday, November 21, 2019

Mana Kamareddy

ఘనంగా శ్రీ కాలభైరవ స్వామి రథోత్సవం...

మన కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ఇస్సన్నపల్లిలో శ్రీ కాలభైరవ స్వామి వారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న అనగా బుధవారం నాడు డోలోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తొట్లేలో బంగారు భైరవుడిని తొట్లేలో ఉంచి లాలిపాట పాడుతూ డోలోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సోమయ్య మరియు ఆలయ చైర్మన్ సతీష్ గుప్తా మరియు భక్తులు అనేక సంఖ్యలో పాల్గొన్నారు.  ఈరోజు జరిగిన స్వామి వారి రథోత్సవం వీడియో మీకోసం...





Read More

Sunday, August 11, 2019

Mana Kamareddy

ఇండియా జోలికొస్తే తాట తీస్తాం: పాక్ ను హెచ్చరించిన ఇజ్రాయిల్

భారత్ - ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల మధ్య బలమైన మిలిటరీ సంబంధాలు ఉన్నాయి. ఇండియా ఎవరినీ నమ్మినా నమ్మకపోయినా.. ఇజ్రాయెల్ ను మాత్రం పక్కాగా నమ్ముతుంది అలాగే భారత్ ఆంటే ఇజ్రాయెల్ కు ఎనలేని ఇష్టం ఎందుకంటే దానికి కారణం లేకపోలేదు ఇజ్రాయిల్ లో యూదులు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఆనాడు యూదులకు భారత్ ఆశ్రయం ఇవ్వటం వల్ల వారంతా ఒక దేశంగా ఏర్పడిన తరువాత భారత్ మీద ఎంతో అభిమానాన్ని పెంచుకున్నారు. ఇజ్రాయిలీ పౌరుడు జీవితంలో ఒక్క సారైనా భారత్ ను సందర్శించాలని కలలు కంటాడు. అందుకే భారత్ అంటే ఇజ్రాయిల్ కు ఎనలేని గౌరవం, అభిమానం.

ఇజ్రాయిల్ భారత్ నుంచి ఏమి ఆశించని గొప్ప మిత్ర దేశం. మిగతా దేశాలు రష్యా, అమెరికా తమ స్వార్ధ ప్రయోజనాలును చూసుకుంటుంది గాని నిజమైన మిత్ర దేశాలుగా మెలగవు. ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి కూడా మోడీ బొమ్మతో ఎన్నికలకు వెళ్లాడంటే అర్ధం చేసుకోవచ్చు. ఇజ్రాయిల్ లో భారత్ దేశం మీద ఎంత ప్రేమ ఉందో !

ఇండియా జోలికొస్తే పాక్ తాట తీస్తాం: ఇజ్రాయెల్

కాశ్మీర్ విషయంలో పాక్ స్పదించిన తీరు, ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇజ్రాయిల్ కు కోపం తెప్పించాయి ఇండియా పక్షాన ఎవరు నిలబడినా నిలబడకపోయినా తాము నిలబడతామని, కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమని, భారత్ జోలికి వస్తే తాట తీస్తామని పాక్ ను హెచ్చరించింది.
ఒకవేళ పీఓకేలో ఉగ్రవాదులను ఏరివేయడానికి భారత్ వెళ్తే తాము కూడా తమ సైన్యాన్ని తోడుగా పంపిస్తామని తేల్చి చెప్పింది.
భారత్ కు ప్రపంచ దేశాల మద్దతు రోజురోజుకు పెరగడంతో పాక్ లోలోపల తీవ్ర మదన పడుతుంది.

Read More

Friday, August 02, 2019

Mana Kamareddy

ప్రసిద్ధ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి (యాదాద్రి) దేవస్థానం అభివృద్ధి పనుల దృశ్యాలు..


తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి (యాదాద్రి) దేవస్థానం అభివృద్ధి  పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 


Read More

Wednesday, January 03, 2018

Mana Kamareddy

మీ మొబైల్ నెంబర్ ని ఆధార్ తో ఇలా ఇంట్లోనుండే సులువుగా లింక్ చేయండి..

మీ మొబైల్ నెంబర్ ను ఆధార్‌తో అనుసంధానం ఇంకా చేయలేదా? అయితే ఈ ఇది మీకోసమే. ఇంతకు ముందులా ఆధార్‌ అనుసంధానానికి రిటైల్‌ స్టోర్లకు పరుగులు పెట్టకుండా సులువుగా ఆధార్‌ అనుసంధానం చేసే పద్ధతిని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో మీ ఇంటి వద్దే మీ మొబైల్‌ నుంచే ఆధార్‌ అనుసంధానం పూర్తిచేయొచ్చు. IVRS పద్ధతిలో ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు.

ఇందు కోసం మీరు మీ ఆధార్‌ నంబర్‌, మొబైల్‌ను కలిగి ఉంటే చాలు. ఎయిర్‌టెల్‌, ఐడియా, జియో, వొడాఫోన్‌ ఇలా ఏ నెట్‌వర్క్‌ కస్టమర్‌ అయినా సరే మీ ఫోన్‌ నుంచి 14546 నెంబర్ను డయల్‌ చేయాల్సి ఉంటుంది.

* తొలుత ఈ ఆ నెంబర్కు డయల్‌ చేయగానే మీరు ఇండియాకు చెందిన వారా లేదా ఎన్నారై కస్టమరా అడుగుతుంది. అందులో ఒక ఐచ్చికాన్ని ఎంపిక చేసుకోవాలి.

* ఆ తర్వాత 1ని ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ ఆధార్‌ నంబర్‌ను పొందుపరిచిన తర్వాత మళ్లీ 1ని నొక్కాలి.

* ఆ తర్వాత మీ మొబైల్‌ నెంబర్కు ఓ వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) వస్తుంది.

* ఆ తర్వాత మీ మొబైల్‌ నెంబర్ను ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ మొబైల్‌ నెంబర్లోని చివరి నాలుగు అంకెలను ధ్రువీకరించాల్సి ఉంటుంది.


* మొబైల్‌ నెంబర్ ధ్రువీకరణ అనంతరం మీ మొబైల్‌కు వచ్చిన (OTP) ఓటీపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత 1ని నొక్కడం ద్వారా మీ ఆధార్‌ నెంబర్ రీ వెరిఫికేషన్‌ను పూర్తిచేయొచ్చు.

* ఒకవేళ మీరు ఇది వరకే ఆధార్‌ అనుసంధానం చేసి ఉంటే ముందుగానే ఆ విషయాన్ని మీకు తెలియజేస్తారు. మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ అర్ధగంటపాటు చెల్లుబాటు అవుతుంది.



Read More

Monday, August 28, 2017

Mana Kamareddy

ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి సామాన్య ఎన్ఆర్ఐ అభిమాని లేఖ...


గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ రావు గారికి హ్రుదయపూర్వక నమస్కారములతో,

ఉద్యమనేతగా, మంచి పరిపాలనదక్షుడుగా ఉన్న మీ ద్రుష్టికి ఒక తెలంగాణ పౌరుడిగా, టి.ఆర్.ఎస్ ని అభిమానించే వ్యక్తిగా కొన్ని విషయాలు తీసుకురాదల్చుకున్నాను. దీనిలో ఎమైన తప్పులుంటే పెద్ద మనసుతో క్షమించగలరు.
నిరంతర విద్యుత్,మిషన్ కాకతీయ,మిషన్ భగీరధ, ఆసరా, పల్లె వ్రుత్తులను పటిష్ట పరిచే అనేక కార్యక్రమాలు ఇప్పటికిప్పుడు ఫలితాలు చూపించకపొయిన భవిష్యత్ తెలంగాణ కు రూపురేఖలు మార్చే అవకాశాలు ఎక్కువ. ఈ పథకాల ముందు ఆ తర్వాత ప్రజల జీవన విధానం మీద మనం తప్పకుండ డాక్యుమెంట్ చెసుకొవాలి. ఎంతో కీలక సమయం లో ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన మీరు ఎన్నొ కుట్రలు చేదించి ప్రభుత్వ పథకాలు, సాగునీటి ప్రాజెక్ట్ లకు ఇబ్బందులు కలగకుండ చూసిన్రు.


Read More

Monday, July 03, 2017

Mana Kamareddy

రేపటి నుండి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జాబ్ మేళా..

మన కామారెడ్డి: తెలంగాణ జాగృతి నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రం నిరుద్యోగ యువతకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నది. తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్తో సహా 15 పట్టణాలలో జులై 4వ తేదీ నుంచి ఆగస్టు 25 వరకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నది.  ఉదయం 10-30 గంటల నుంచి సాయంత్రం 4-30 గంటల వరకు జాబ్ మేళా జరుగుతుంది. టెన్త్ పాస్ అయిన వారు, ఆపై ఉన్నత విద్యార్హత   కలిగిన వారు కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. 


కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) పథకం లో భాగంగా,  తెలంగాణలోని పార్లమెంటు నియోజక వర్గాలలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు తెలంగాణ జాగృతి నైపుణ్య శిక్షణాభివృద్ధి కేంద్రాలు పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేంద్రాలలో శిక్షణ పొందిన నిరుద్యోగ యువతతో పాటు ఇతరులు కూడా జాబ్ మేళాలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. లాజిస్టిక్స్, రిటెయిల్, ఎలక్ట్రానిక్స్, బ్యూటీ అండ్ వెల్నెస్, హోటల్ మేనేజ్మెంట్ రంగాల్లో ఉద్యోగాల నియామకాల కోసం ఆయా రంగాల కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. వీటితోపాటు బిపిఓ, ఎలక్ర్టానిక్స్, అగ్రిబేస్డ్ కంపెనీలు,  ఫార్మసీ సంస్థలు, హోటల్ పరిశ్రమ, బ్యూటీ అండ్ వెల్నెస్, సెక్యూరిటీ  సర్వీసెస్ సంస్థలు జాబ్ మేళాలో పాల్గొంటాయి. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత తమ వెంట లేటెస్ట్ రిజ్యూమ్ తెచ్చుకోవలసి ఉంటుందని తెలంగాణ జాగృతి స్కిల్స్ డెవలప్మెంట్ ట్రయినింగ్ సెంటర్ సిఇఓ అబ్ధుల్ బాసిత్ తెలిపారు. మరిన్ని వివరాలకు హైదరాబాద్ దోమలగూడలోని నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రధాన కార్యాలయంలో వ్యక్తిగతంగా కాని  040-40214215 నెంబర్కు కాల్ చేసి తెలుసుకోవచ్చని  ఆయన తెలిపారు.


Skill development Contact Numbers:

  • Hyd - Ashoknagar – 040 – 40214215,
  • Hyd - Charminar – 040-24410211,
  • Bhongir- 08685244266, 
  • Khammam -08742234215,
  • Mahabubnagar – 08686793145,
  • Mancherial -08736253535,
  • Nirmal- 08734244466,
  • Dilkhuknagar-04024147555,
  • Karimnagar-0878-6515666,
  • Nizamabad-08462240678,
  • Wanaparthy- 09642435228,
  • Zaheerabad-07451280822,
  • Nalgonda- 08682247227,
  • Hanamkonda- 08702554333,
  • Siddipet – 0845723123


Read More