ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రహమాన్‌కు వైట్ హౌజ్‌లో అరుదైన గౌరవం దక్కింది. రహమాన్ జీవిత విశేషాలతో కూడిన దూపొందించిన జయహో డాక్యుమెంటరీని వైట్ హౌస్‌లో ప్రదర్శించారు. అయన సంగీతంలో చూపించిన ప్రతిభ, వైవిద్యం, వ్యక్తిగత జీవితం, వృత్తి, ప్రవృత్తి విశేషాలతో దర్శకుడు ఉమేష్ అగర్వాల్ గంట వ్యవధితో డాక్యుమెంటరీని రూపొందించారు. డాక్యుమెంటరీలో రహమాన్ తో పనిచేసిన ప్రముఖ దర్శకులు వారి వారి అనుభూతులను పంచుకున్నారు. రహమాన్ పొందిన అస్కార్ అవార్డు నుండి గ్రామీ అవార్డు వరకు అన్నింటిని పొందుపరడం విశేషం. ఈ మేరకు వైట్‌హౌస్ గౌరవంపై రహమాన్ స్పందిస్తూ ట్విట్టర్లో ట్విట్ చేసారు.
మన కామారెడ్డి వ్యూయర్స్ కోసం జయహో వీడియో..