స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణా ఎన్ఆర్ఐ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఇండియా ఇండిపెండెన్స్ పెరేడ్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలు వుట్టి పడే విధంగా తెలంగాణా శకటాన్ని తయారు చేసి నగర వీదుల్లో డప్పు దరువుల మధ్య జాతీయ జెండాను చేత బట్టి ఊరేగింపు చేసారు. ఈ కార్యక్రమంలో శకటంలో ఉన్న తెలంగాణా అమరవీరుల స్థూపానికి అలాగే స్వాతంత్ర్య సమరయోధులకు, అమర జవానులకు అంజలి ఘటించి కార్యక్రమం కొనసాగించారు. ఈ సందర్భంగా మహిళలు తెలంగాణా బతుకమ్మలతో ఊరేగింపులో పాల్గొనటం పలువురిని ఆకర్షించింది. ఈ సందర్భంగా ఒక ప్రవాస భారతీయుడు మన కామారెడ్డి పోర్టల్ కి కొన్ని ఫోటోలను ప్రత్యేకంగా పంపించాడు. వాటిని మీ కోసం ప్రత్యేకంగా పబ్లిష్ చేస్తున్నాం..