కొరటాల శివ దర్శకత్వంలో, మహేష్ బాబు హీరో గా వచ్చిన శ్రీమంతుడు సినిమా గురించి కొన్ని మంచి మాటలు...తను జన్మించిన ఊరి కోసం ఒక శ్రీమంతుడి కొడుకు ఏం చేస్తాడో దర్శకుడు చాల చక్కగా తెరకెక్కించాడు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలైతే హృదయాన్ని తాకుతాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రస్తుత కాలంలో పట్టనీకరణలో భాగంగా గ్రామాల నుండి పెరిగిపోతున్న వలసలను, గ్రామల ప్రజల కష్టాలను రాజకీయ అంశాలతో ముడి పెట్టి చాల బాగా చూపించాడు దర్శకుడు. సినిమాలో కథ మొత్తం వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలోని దేవరకోట అనే గ్రామం చుట్టూ తిరుగుతుంది.
శ్రీమంతుడు చిత్రంలో పల్లెటూరులో పుట్టిపెరిగి కొన్ని కారణాల వల్ల పుట్టిన ఊరిని వదిలిన ఒక శ్రీమంతుడి కొడుకుగా హీరో మహేష్ బాబు పోషించిన పాత్ర యువతకి నిజంగా స్పూర్తిగా నిలుస్తుంది. దానికి తోడు అన్న తమ్ములమద్య వుండే అనురాగాన్ని, ఆప్యాయతని కూడా చక్కగా చూపించారు. కొడుకు కోసం తన వుమ్మడి కుటుంబాన్ని వదిలి ముఖ్యంగా తన అన్నని, తన ఊరుని వదిలి పెట్టి పోవాలనుకున్న వ్యక్తి భార్యతో హీరో అన్న ఈ క్రింది మాటలు, సొంత ఊరు (పల్లెటూరు) ప్రాముఖ్యత హృదయానికి తాకుతుంది.
తన కొడుకు ఊరులో ఉండకూడదని, వుంటే హాని అని తన ఇంటికి తీసుకువచ్చిన ఒకశ్రీమంతుడి కొడుకు తన తండ్రి తో అన్న ఈ క్రింది మాటలు..గ్రామాలలో జన్మించిన ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతయనటంలో ఏమాత్రం సందేహం లేదు.
ఆలాగే తన ఊరికి సేవ చేయటానికి తన తల్లి తండ్రులకు దూరంగా వెళ్తున్న ఒక యువకుడు తన తండ్రి తో ఉద్వేగంతో అన్న ఈ క్రింది మాటలు కూడా ఎంతో స్ఫూర్తి కి కలిగిస్తాయి.
మొత్తానికి చిత్రంలోని చాల సన్నివేషాలు ..గ్రామాలలో (పల్లెటూర్లలో) జన్మించిన ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. సినిమాని కేవలం సినిమాలానే చూడకుండ అందులోని కొంత మంచిని కూడా గ్రహించాలన్నదే మన కామారెడ్డి పోర్టల్ ఉద్దేశం. వృత్తి రీత్యా లేదా వ్యాపారం రీత్యా గ్రామాల నుండి వెళ్ళి పట్టణాల్లో, విదేశాలలో స్థిర పడిన వారెవరైనా వారి వారి స్థోమతకు తగిన విధంగా ఎంతో కొంత తమ తమ గ్రామాలకు సేవ చేయాలని కోరుకుంటూ...
- ఎడిటర్ (మన కామారెడ్డి)

పట్టణాల్లో ఇంట్లో నిలబడి చూస్తే బయట నాలుగు పెద్ద మేడలు, పల్లెటూరు కంటే నాలుగు గంటలు ఎక్కువగా కరెంటు వుంటది.. కాని నీతో మాట్లాడటానికి నీచుట్టూ పక్కల మాత్రం ఎవరు వుండరు...అదే ఊర్లో ఐతే ఎంత మంది ఉన్నారు చూడు...!!
తన కొడుకు ఊరులో ఉండకూడదని, వుంటే హాని అని తన ఇంటికి తీసుకువచ్చిన ఒకశ్రీమంతుడి కొడుకు తన తండ్రి తో అన్న ఈ క్రింది మాటలు..గ్రామాలలో జన్మించిన ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతయనటంలో ఏమాత్రం సందేహం లేదు.
నన్ను ఊరి నుండి తీసుకొచ్చారు కాని నా నుండి ఊరిని వేరు చేయలేరు..!!
ఆలాగే తన ఊరికి సేవ చేయటానికి తన తల్లి తండ్రులకు దూరంగా వెళ్తున్న ఒక యువకుడు తన తండ్రి తో ఉద్వేగంతో అన్న ఈ క్రింది మాటలు కూడా ఎంతో స్ఫూర్తి కి కలిగిస్తాయి.
ఈ జన్మకు ఇంతవరుకు చాలు నాన్న, నేను ఊరికి మంచి చేయటానికి వెళ్తున్న..మళ్ళి జన్మంటూ వుంటే నీకు కొడుకుగా పుడతా..