కామారెడ్డిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల దృశ్యం |
కామారెడ్డి లోని డివిజన్ లోని అన్ని మండల కేంద్రాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మండల కేంద్రాలలో ఉన్న కార్యాలయాలలో ఆయా అధికారులు, వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాలలో ఆయా మండల నాయకులు పాల్గొని జెండా ఎగురవేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో మండలకేంద్రాలలో రోడ్లన్నీ విద్యార్థుల శోభయాత్రలతో కిక్కిరిసి పోయాయి.
కామారెడ్డిలో...
కామారెడ్డి పట్టణంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ కార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆర్డీవో కార్యాయలంలో ఆర్డీవో నగేశ్, మునిసిపల్ కార్యాలయంలో ఛైర్మన్ పిప్పిరి సుష్మ, తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ అనిల్, వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఐడిసిఎంఎస్ ఛైర్మన్ ముజీబుద్దీన్లు, వివిధ రాజకీయ పార్టీ కార్యాలయాల్లో ఆయా నాయకులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు. స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న నాయకులను స్మరించుకున్నారు అలాగే దేశం కోసం ప్రతి క్షణం పాటుపడుతున్న జవాన్ల సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వివధ పాటశాలల చెందిన విద్యార్థుల శోభాయాత్ర ప్రజలని అలరించింది.