
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసుకోవటానికి ప్రభుత్వం ఆన్ లైన్ విధానాన్ని తీసుకువచ్చింది. మధ్య దళారుల అవినీతి దృష్టిలో ఉంచుకొని, నిజమైన లబ్దిదారులకు ఈ పథకం యొక్క ఫలాలు చెందాలనే ఉద్దేశంతో, ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరుగకుండా, దగ్గరలో వున్న మీ సేవా కేంద్రాలలోనే దరఖాస్తు చేసుకొనే విధంగా ఏర్పాటు చేసింది.
దరఖాస్తు చేసుకునే విధానం:
-అర్హత ఉన్నవారు స్థానిక మీసేవా కేంద్రాల్లో సంప్రదించాలి.అక్కడ దరఖాస్తు ఫారాన్ని తీసుకుని, పూర్తి వివరాలతో నింపాలి.
-ఫారానికి పాస్‌పోర్టుసైజ్ ఫొటోతోపాటు, ఆధార్, ఫుడ్‌సెక్యూరిటీ కార్డు జిరాక్సులను జతపర్చాలి.
-కుటుంబ సభ్యుల ఆధార్‌కార్డు ఉంటే మంచింది.
-ప్రస్తుత అడ్రస్‌లో ప్లాట్‌నెంబర్ కాకుండా ఇంటి నెంబర్ ఉండేలా చూసుకోవాలి.మండలం, గ్రామం, కాలనీ, డివిజన్, ల్యాండ్‌మార్క్, లొకాలిటీ వంటి అంశాలను తప్పనిసరిగా పేర్కొనాలి.
-దరఖాస్తు దారుడి ఆధార్ నెంబర్, వయస్సు, సంవత్సర ఆదాయం, సెల్ నెంబర్లను కూడా తెలియపర్చాలి.
-గతంలో ప్రభుత్వ ఆసరా పెన్షన్, ఇళ్లు పొందినవారైతే స్పష్టంగా వివరాలను తెలపాలి.మొబైల్ నెంబర్, ఉంటే ఈ – మెయిల్ ఐడీలను పొందుపర్చాల్సి ఉంటుంది.
-ఇలా అన్ని వివరాలతో కూడిన ఫారాన్ని మీ సేవా కేంద్రాల్లో ఇస్తే, సదరు నిర్వాహకులు పరిశీలించి ఆన్లైన్లో దరఖాస్తు ఫారం, ఫొటోలను అప్లోడ్ చేసి, మిగతా వివరాలను నింపుతారు.
-అనంతరం చెల్లిపు రశీదును అందించినప్పుడు రూ.25ను చెల్లించాల్సి ఉంటుంది. దళారుల చేతుల్లో మోసపోకుండా నేరుగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.