టెలీస్కోప్ ని కనుగొన్న గెలీలియో ఆనాడే చెప్పాడు ఏదైనా రెండు వస్తువులు బరువుతో సంబంధం లేకుండా ఎత్తు నుండి జార విడిచినపుడు ఆ రెండు వస్తువులు ఒకేసారి భూమిని చేరుతాయి అని. కాని ఈ ప్రక్రియ సాధ్యమయ్యేది ఆ ప్రాంతంలో గాలి లేనపుడు మాత్రమేనని. మనకి తెలిసినంతవరకు రెండు వస్తువు జార విడిచినపుడు ఆ రెండింటిలో ఏది బరువుగా ఉంటే అది ముందు క్రింద పడుతుందని. ఆనాడు గెలీలియో చెప్పినది నిజం చేయటానికి సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత బిబిసి ఛానెల్ ఆధ్వర్యంలో ఇపుడున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం ఎలా జరిగిందో కింది వీడియోలో చూడండి.