Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Thursday, November 21, 2019

Mana Kamareddy

ఘనంగా శ్రీ కాలభైరవ స్వామి రథోత్సవం...

మన కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ఇస్సన్నపల్లిలో శ్రీ కాలభైరవ స్వామి వారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న అనగా బుధవారం నాడు డోలోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తొట్లేలో బంగారు భైరవుడిని తొట్లేలో ఉంచి లాలిపాట పాడుతూ డోలోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సోమయ్య మరియు ఆలయ చైర్మన్ సతీష్ గుప్తా మరియు భక్తులు అనేక సంఖ్యలో పాల్గొన్నారు.  ఈరోజు జరిగిన స్వామి వారి రథోత్సవం వీడియో మీకోసం...





Read More

Sunday, August 11, 2019

Mana Kamareddy

ఇండియా జోలికొస్తే తాట తీస్తాం: పాక్ ను హెచ్చరించిన ఇజ్రాయిల్

భారత్ - ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల మధ్య బలమైన మిలిటరీ సంబంధాలు ఉన్నాయి. ఇండియా ఎవరినీ నమ్మినా నమ్మకపోయినా.. ఇజ్రాయెల్ ను మాత్రం పక్కాగా నమ్ముతుంది అలాగే భారత్ ఆంటే ఇజ్రాయెల్ కు ఎనలేని ఇష్టం ఎందుకంటే దానికి కారణం లేకపోలేదు ఇజ్రాయిల్ లో యూదులు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఆనాడు యూదులకు భారత్ ఆశ్రయం ఇవ్వటం వల్ల వారంతా ఒక దేశంగా ఏర్పడిన తరువాత భారత్ మీద ఎంతో అభిమానాన్ని పెంచుకున్నారు. ఇజ్రాయిలీ పౌరుడు జీవితంలో ఒక్క సారైనా భారత్ ను సందర్శించాలని కలలు కంటాడు. అందుకే భారత్ అంటే ఇజ్రాయిల్ కు ఎనలేని గౌరవం, అభిమానం.

ఇజ్రాయిల్ భారత్ నుంచి ఏమి ఆశించని గొప్ప మిత్ర దేశం. మిగతా దేశాలు రష్యా, అమెరికా తమ స్వార్ధ ప్రయోజనాలును చూసుకుంటుంది గాని నిజమైన మిత్ర దేశాలుగా మెలగవు. ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి కూడా మోడీ బొమ్మతో ఎన్నికలకు వెళ్లాడంటే అర్ధం చేసుకోవచ్చు. ఇజ్రాయిల్ లో భారత్ దేశం మీద ఎంత ప్రేమ ఉందో !

ఇండియా జోలికొస్తే పాక్ తాట తీస్తాం: ఇజ్రాయెల్

కాశ్మీర్ విషయంలో పాక్ స్పదించిన తీరు, ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇజ్రాయిల్ కు కోపం తెప్పించాయి ఇండియా పక్షాన ఎవరు నిలబడినా నిలబడకపోయినా తాము నిలబడతామని, కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమని, భారత్ జోలికి వస్తే తాట తీస్తామని పాక్ ను హెచ్చరించింది.
ఒకవేళ పీఓకేలో ఉగ్రవాదులను ఏరివేయడానికి భారత్ వెళ్తే తాము కూడా తమ సైన్యాన్ని తోడుగా పంపిస్తామని తేల్చి చెప్పింది.
భారత్ కు ప్రపంచ దేశాల మద్దతు రోజురోజుకు పెరగడంతో పాక్ లోలోపల తీవ్ర మదన పడుతుంది.

Read More

Friday, August 02, 2019

Mana Kamareddy

ప్రసిద్ధ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి (యాదాద్రి) దేవస్థానం అభివృద్ధి పనుల దృశ్యాలు..


తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి (యాదాద్రి) దేవస్థానం అభివృద్ధి  పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 


Read More

Wednesday, October 17, 2018

Mana Kamareddy

ప్రపంచాన్నంతటినీ కన్నీళ్ళు పెట్టించిన వాస్తవ కథ..

మా అమ్మకు ఒక్క కన్నే ఉండేది. మా అమ్మంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది. ఆమె ఓ చిన్న కొట్టు నడుపుతుండేది ఒక రోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవడానికి స్కూల్ కి వచ్చింది. ఇంక అప్పట్నించి చూడండి. ”మీ అమ్మ ఒంటి కన్నుది” అని స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు, అవహేళనలు.అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే. అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టానబ్బా అనిపించేది. ఒక్కోసారి నాకు.అసలామె ఈ లోకం నుంచే ఒక్కసారిగా అదృశ్యమైపోతే బావుణ్ణు. అనిపించేది.
“అమ్మా నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీవల్ల నేను అందరికీ చులకన అయిపోయాను. నువ్వు చచ్చిపో!” కోపంగా అరిచేసే వాణ్ణి.

ఆమె మొహంలో నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనిపించేదికాదు. నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చేది. అయినా సరే అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడలేని సంతోషంగా ఉండేది. ఆమె నన్ను ఎప్పుడూ దండించలేదు కాబట్టి ఆమెను నేను ఎంతగా భాధ పెట్టానో నాకు తెలియదు.ఒక రోజు రాత్రి యధాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాను. మద్యలో దాహం వేసి మెలుకువ వచ్చింది. నీళ్ళు తాగడానికి వంటగదిలోకి వెళ్ళాను. అమ్మ అక్కడ ఒంటరిగా రోదిస్తోంది. మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక్క కంటిలోంచే నీళ్ళు. నా సహజ స్వభావం ఎక్కడికి పోతుంది? మొహం తిప్పుకుని వెళ్ళిపోయాను. ఎక్కడికొచ్చినా నన్ను అవమానాలు పాలు చేసే మా అమ్మను, మా పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతుణ్ణవ్వాలనీ, బాగా పేరు సంపాదించాలనీ కలలుగంటూ నిద్రపోయాను.

ఆ తరువాత నేను చాలా కష్టపడి చదివాను. పై చదువుల కోసం అమ్మను వదిలి వచ్చేశాను. మంచి విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను. బాగా డబ్బు సంపాదించాను. మంచి ఇల్లు కొనుక్కున్నాను. మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకున్నాను. నాకిప్పుడు ఇద్దరు పిల్లలు కూడా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా జీవితం గడిచిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఒంటికన్ను అమ్మ లేదుకదా!

అలా ఎడతెరిపిలేని సంతోషాలతో సాగిపోతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చింది మహాతల్లి. ఇంకెవరు? మా అమ్మ. ఆమె ఒంటి కన్ను చూసి రెండేళ్ళ నా కూతురు భయంతో జడుసుకుంది. “ఎవరు నువ్వు? ఎందుకొచ్చావిక్కడికి? నువ్వెవరో నాకు తెలియదు. నా ఇంటికొచ్చి నా కూతుర్నే భయపెడతావా?ముందు నువ్వెళ్ళిపో ఇక్కడ్నుంచి!!!” సాధ్యమైనంతవరకు తెలియనట్లే నటించాను.

“క్షమించండి బాబూ! తెలియక తప్పుడు చిరునామాకి వచ్చినట్లున్నాను” ఆమె అదృశ్యమైపోయింది. “హమ్మయ్య ఆమె నన్ను గుర్తు పట్టలేదు”. భారంగా ఊపిరి పీల్చుకున్నాను. ఇక ఆమె గురించి జీవితాంతం పట్టించుకోనవసరం లేదు అనుకున్నాను.

కానీ కొద్దిరోజులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని ఒక ఆహ్వాన పత్రం అందింది నాకు. వ్యాపార నిమిత్తం వెళుతున్నానని మా శ్రీమతికి అబద్ధం చెప్పి అక్కడికి బయలు దేరాను. స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళాను. ఎంత వద్దకున్నా నా కళ్ళు లోపలి భాగాన్ని పరికించాయి. మా అమ్మ ఒంటరిగా కటిక నేలపై పడి ఉంది. ఆమె చేతిలో ఒక లేఖ. నా కోసమే రాసిపెట్టి ఉంది. దాని సారాంశం.

ప్రియమైన కుమారునికి,
ఇప్పటికే నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువే బతికాను. నేనింక నీవుండే దగ్గరికి రాను. కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా! ఏం చేయమంటావు? నిన్ను చూడకుండా ఉండలేకున్నాను. కన్నపేగురా. తట్టుకోలేక పోతోంది. నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నావని తెలిసిన నా ఆనందానికి పట్టపగాలు లేవు. కానీ నేను మాత్రం నీకోసం స్కూల్ దగ్గరికి రానులే. వస్తే నీకు మళ్ళీ అవమానం చేసినదాన్నవుతాను. ఒక్క విషయం మాత్రం ఇప్పటికి చెప్పక తప్పడం లేదు. చిన్నా! నీవు చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు ఒక ప్రమాదంలో నీకు ఒక కన్నుపోయింది. నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఒక కంటితో చూడలేకపోయాన్రా కన్నా! అందుకనే నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను. నా కంటితో నువ్వు ప్రపంచం చూస్తున్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా? నువ్వు చేసిన పనులన్నింటికీ నేను ఎప్పుడూ బాధపడలేదు. ఒక్క రెండు సార్లు మాత్రం ” వాడు నా మీద కోప్పడ్డాడంటే నా మీద ప్రేమ ఉంటేనా కదా!” అని సరిపెట్టుకున్నాను. చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతులు.

ఉత్తరం తడిసి ముద్దయింది. నాకు ప్రపంచం కనిపించడం లేదు.నవనాడులూ కుంగిపోయాయి. భూమి నిలువుగా చీలిపోయి అందులో చెప్పలేనంత లోతుకి వెళ్ళిపోయాను. తన జీవితమంతా నాకోసం ధారబోసిన మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్ళు కారిస్తే సరిపోతాయి? ఎన్ని జన్మలెత్తి ఆమె ఋణం తీర్చుకోను?
Note: ఇది ఇంగ్లీష్ కథకు అనువాదం, అనువాదం చేసిన వారికి ధన్యవాదాలు


Read More

Monday, May 14, 2018

Mana Kamareddy

అమ్మ కన్నీళ్లకు బిడ్డ పశ్చాతాపం ఇది..!


నిన్న మదర్స్ డే సందర్భంగా సోషల్ మీడియా గ్రూపులతో  'అమ్మ' గురుంచి రకరకాల మెసేజ్ లు, అమ్మ తో దిగిన ఫొటోలతో మొత్తం నిండిపోయింది. అలాగే ఒక కొడుకు తన తల్లి పడ్డ బాధలను గుర్తు చేసుకుంటూ కొడుకు చూపిన పశ్చాతాపం, భాధ ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. కాస్త సమయం తీసుకోని మరి ఒక్కసారి చదవండి.


Read More

Friday, February 02, 2018

Mana Kamareddy

మేడారం సమ్మక్క సారక్క జాతర (1950 వ సంవత్సరం నాటి ఫోటోలు)

దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతరైన మన మేడారం సమ్మక్క సారక్క జాతర 1950 వ సంవత్సరంలో ఎలా జరిగిందో క్రింది చిత్రాలలో చూడండి.











Read More

Wednesday, January 31, 2018

Mana Kamareddy

ఈరోజు ఉన్న సంపూర్ణ చంద్ర గ్రహణం యొక్క అద్భుతాలు


ఆకాశంలో నేడు ఒక అద్భుతం జరగబోతోంది. ఎప్పటిలా కాకుండా చంద్రుడు ఒక అరుదైన రూపంలో కనిపించనున్నాడు. ఈరోజు సాయంత్రం 6:21- 7:37, (జనవరి 31) చంద్రుడు సూపర్ బ్లూ బ్లడ్ మూన్ గా దర్శనమివ్వనున్నాడు.

ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి ?

1.  సూపర్ మూన్
2.  బ్లూ మూన్
3.  బ్లడ్ మూన్ లాంటివి జరుగుతాయి.

1)  సూపర్ మూన్ అంటే ఏమిటి ?

అంటే చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్య లో తిరుగుతూ ఉండటం వలన ఒకానొక సమయంలో భూమికి చాలా దగ్గరకు వస్తాడు. అందువలన చంద్రుని సైజు పెరిగి పెద్దది గా కనిపిస్తుంది. 31వతేదీన ఇలాగే చంద్రుని సైజు 14% పెద్దదిగా కనిపిస్తుంది. ఇలా పెద్ద గా కనిపించే చంద్రుని బింబాన్ని సూపర్ మూన్ అంటారు.

సూపర్ మూన్ రోజు ఇలా చంద్రుని సైజు పెరిగి కనిపిస్తుంది.(తెలుపు రంగు)

2) బ్లూ మూన్ అని ఎందుకు అంటారు ?

ఇందులో బ్లూ రంగు ఏమీ లేదు కానీ ఒకే నెలలో రెండు పౌర్ణమీ లు (Full moon) వస్తే దాన్ని శాస్త్ర వేత్తలు బ్లూ మూన్ గా పిలుస్తారు.

క్యాలెండర్‌ ని గమనిస్తే జనవరి 2వ తేదీన ఒకసారి పౌర్ణమి వచ్చిన విషయం, మళ్ళీ జనవరి 31వ తేదీన రెండవసారి పౌర్ణమి రావటమే.

3) చంద్రుడు బ్లడ్ మూన్ గా ఎలా మారుతాడు?

సంపూర్ణ చంద్ర గ్రహణం వలన చంద్రుని మీద డైరెక్ట్ గా  సూర్య  కిరణాలు పడక పోవటం వలన చంద్రుడు ప్రకాశవంతంగా, తెల్లగా ఉండడు. కానీ  భూమి పై పడిన సూర్య కిరణాలు భూమి వాతావరణంలో ని ధూళి, తేమ వలన పరావర్తనం,వికిరణం చెంది వాటిలోని ఎరుపురంగులో కిరణాలు భూమి అంచులనుంచి పోయి చంద్రుని మీద పడతాయి కాబట్టి సంపూర్ణ చంద్ర గ్రహణం రోజు చంద్రుని బింబం ఎరుపు/ ఆరెంజ్/పసుపు రంగు లో కనిపిస్తుంది. అందుకే రక్తం రంగు లో కనిపిస్తుంది కాబట్టి బ్లడ్ మూన్ అని పేరుపెట్టారు. (ఇది రోజూ ఉదయం, సాయంత్రం మనకు సూర్యుడు ఇలాంటి రంగులో కనిపించే విషయం కు సమానం. రెంటికీ కారణం భూమి చుట్టూ ఉన్న  వాతావరణం.)

4) ఇలాంటిది గతంలో ఎప్పుడు జరిగింది ?

ఇలాంటి ఖగోళ ఘట్టం, గతంలో 1866 సం.లో సంభవించింది. తిరిగి 151 సం.ల తర్వాత ఇపుడు, అంటే 31.01.2018 నాడు ఆ పరిస్థితి పునరావృతం ఔతుంది, కాబట్టి ప్రజలందరూ తప్పకుండ  చూసి అనందించాలి. 

5) ఎక్కడి నుంచి చూడవచ్చు:

*భవంతులు, చెట్లు, కొండలు లేని ప్రదేశంలో అయితే చంద్రుడి ని చూడవచ్చు.

*పాఠశాల, కళాశాల విద్యార్థులు మైదానాల్లో బృందం గా కలిసి చూడగలరు.

*ఇంకా స్పష్టంగా కనిపించాలంటే టెలిస్కోప్ ద్వారా చూస్తే ఎర్రని చంద్రుడిని ఎక్కువగా అస్వాదించగలరు.

గ్రహణాల మీద ఉన్న అపోహలు - వాస్తవాలు :

1) చంద్ర గ్రహణం చూడకూడదని అంటారు ఇది వాస్తవమా? ఒక వేళ చూస్తే, కళ్ళతో నేరుగా చూడవచ్చా?

కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రహాలు/ ఉప గ్రహాలు మనిషి కి హాని చేస్తాయని భావించడం ఇది పూర్తిగా అవాస్తవం.

చంద్ర గ్రహణం సందర్భంగా ఏ ప్రమాదకర కిరణాలు వెలువడవు, కాబట్టి ఎలాంటి ఫిల్టర్లు (మన కంటికి అడ్డంబెట్టుకునే) అవసరం లేకుండానే.. మనం, మన మామూలు కంటితో సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని చూడొచ్చు....

2) చంద్ర గ్రహణం సమయంలో ఆహార పదార్థాలను తినకుడదంటారు నిజమేనా?  పదార్థాల లో గరక గడ్డి వేయడం వలన గ్రహణం ప్రభావం ఏమీ ఉండదని భావించడం, ఒక వేళ గరక వేయని పదార్థాలు బయట పారవేయడం. ఇది సరియైనదేనా ...?

నిజము కాదు...
ఆ సమయంలో అల్పాహారం, భోజనం  తీసుకున్నా ఏమి అవ్వదు. ఇవి కేవలం భ్రమలు, మూఢ విశ్వాసము మాత్రమే అవుతుంది. నిజమే అని భావించేవారు మీ ఊరు/పట్టణం లోకి గ్రహణం సమయంలో వెళ్ళి హోటల్లో, మిఠాయి దుకాణా ల్లో , తోపుడు బండ్ల వద్ద ప్రజలు ఆహార పదార్థాలను తింటున్నారో  లేదో గమనించండి. 

ఎందుకంటే, ఉదాహరణకు హోటల్లో వండిన వంటకాలు మిఠాయి దుకాణాలలో తయారు చేసిన మిఠాయిలలో ఎవ్వరూ గరక గడ్డి వేయరు, వేయడం మర్చిపోయినా గ్రహణం ప్రభావం ఉంటుందని, చెడిపోయినవి అని చెత్తకుండీ లో వేయలేరు..... వేయరు కూడా.....

3) గ్రహణం సమయంలో బయట తిరిగితే శరీర అవయవాలు దెబ్బతింటాయని భావించవచ్చా?

భూమి మీద ఆధారపడి మనిషులు మాత్రమే నివసించడం లేదని గ్రహించాలి. జంతువులు, పక్షులు, కీటకాలు, సరీసృపాలు కూడా నివసిస్తున్నాయి.

అలాంటి చెడు ప్రభావాలు ఉంటే వాటి సంగతి ఏమిటో అలోచించండి.

గ్రహణం ప్రభావం ఉంటుంది అనుకునేవారు గ్రహణం సమయంలో మీకు తెలిసిన సమీప పట్టణం లోని షాప్ యజమాని కి పోన్ చేసి బజారులో మనుషులు తిరుగుతున్నారా? లేదా కనుక్కోవటం వలన మీరే ఒక నిర్ధారణకు వస్తారు..... అప్పుడు మీరు నమ్మేది వాస్తవమా?  మేము చెప్పేది వాస్తవమా మీరే తెలుసుకుంటారు. కాబట్టి శరీరం లోపల ఏ అవయవాలు చెడిపోవని గ్రహించండి.

4) గ్రహణం చూస్తే గర్భిణీ స్త్రీలకు / గర్భంలో ఉన్న శిశివుకు హాని జరిగి మొర్రి (పై పెదవి చీలికలు గా ఉండటం) వస్తుందని అని కొందరు భావిస్తారు ఇది సబబేనా?

ఇలా భావించడం సరియైనది కాదు .దానికి సంబంధం లేదు. అలా  అయితే ఆ సమయంలో ప్రపంచంలో అనేక మంది పిల్లలు పుట్టిన వారందరికీ రావాలిగా....అలా జరగడం లేదుగా ..

అసలు గ్రహణం చూడటం వల్ల సాధారణ మనుషులతో పాటు, గర్భిణీ స్త్రీలకు గానీ, మరి ఏ ఇతర జీవరాశికి గానీ ఎలాంటి ప్రమాదం సంభవించదు..

ఇలాంటి మూఢ నమ్మకాలు విశ్వసించకుండా చంద్రుడి అద్భుతాలు కుటుంబ సభ్యులతో కలిసి చూసి ఆనందించాలి.

కాని మూఢ నమ్మకాల్లో మునిగిపోయి ఇంట్లోనే ఉండకుండా బయటకు    వచ్చి ఈ ఖగోళ ఘట్టాన్ని చూడండి... ఇతరులకు చూపించండి....

"మూఢ నమ్మకాలను వీడండి - శాస్త్రీయంగా ఆలోచించండి - ఆచరించండి"

జన విజ్ఞాన వేదిక తెలంగాణ సౌజన్యంతో...

Read More

Wednesday, January 03, 2018

Mana Kamareddy

మీ మొబైల్ నెంబర్ ని ఆధార్ తో ఇలా ఇంట్లోనుండే సులువుగా లింక్ చేయండి..

మీ మొబైల్ నెంబర్ ను ఆధార్‌తో అనుసంధానం ఇంకా చేయలేదా? అయితే ఈ ఇది మీకోసమే. ఇంతకు ముందులా ఆధార్‌ అనుసంధానానికి రిటైల్‌ స్టోర్లకు పరుగులు పెట్టకుండా సులువుగా ఆధార్‌ అనుసంధానం చేసే పద్ధతిని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో మీ ఇంటి వద్దే మీ మొబైల్‌ నుంచే ఆధార్‌ అనుసంధానం పూర్తిచేయొచ్చు. IVRS పద్ధతిలో ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు.

ఇందు కోసం మీరు మీ ఆధార్‌ నంబర్‌, మొబైల్‌ను కలిగి ఉంటే చాలు. ఎయిర్‌టెల్‌, ఐడియా, జియో, వొడాఫోన్‌ ఇలా ఏ నెట్‌వర్క్‌ కస్టమర్‌ అయినా సరే మీ ఫోన్‌ నుంచి 14546 నెంబర్ను డయల్‌ చేయాల్సి ఉంటుంది.

* తొలుత ఈ ఆ నెంబర్కు డయల్‌ చేయగానే మీరు ఇండియాకు చెందిన వారా లేదా ఎన్నారై కస్టమరా అడుగుతుంది. అందులో ఒక ఐచ్చికాన్ని ఎంపిక చేసుకోవాలి.

* ఆ తర్వాత 1ని ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ ఆధార్‌ నంబర్‌ను పొందుపరిచిన తర్వాత మళ్లీ 1ని నొక్కాలి.

* ఆ తర్వాత మీ మొబైల్‌ నెంబర్కు ఓ వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) వస్తుంది.

* ఆ తర్వాత మీ మొబైల్‌ నెంబర్ను ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ మొబైల్‌ నెంబర్లోని చివరి నాలుగు అంకెలను ధ్రువీకరించాల్సి ఉంటుంది.


* మొబైల్‌ నెంబర్ ధ్రువీకరణ అనంతరం మీ మొబైల్‌కు వచ్చిన (OTP) ఓటీపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత 1ని నొక్కడం ద్వారా మీ ఆధార్‌ నెంబర్ రీ వెరిఫికేషన్‌ను పూర్తిచేయొచ్చు.

* ఒకవేళ మీరు ఇది వరకే ఆధార్‌ అనుసంధానం చేసి ఉంటే ముందుగానే ఆ విషయాన్ని మీకు తెలియజేస్తారు. మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ అర్ధగంటపాటు చెల్లుబాటు అవుతుంది.



Read More

Monday, November 20, 2017

Mana Kamareddy

పవన్ కళ్యాణ్ సినిమాకి చెందిన 'బయటకొచ్చి చూస్తే' జర్మన్ దేశస్థుడు పాడితే...

ఈ మధ్యే విడుదలై దుమ్ము రేపుతున్న పవన్ కళ్యాణ్ సినిమాకి చెందిన 'బయటకొచ్చి చూస్తే' పాటను ౨౨ ఏళ్ళ చేరిస్పెల్ అనే జర్మన్ దేశస్థుడు గిటార్ వాయిస్తూ పాడాడు.  జర్మనీలో తెలుగు విద్యార్థుల రూమ్ మెట్ అయిన చేరిస్పెల్ పాడిన ఈ పాట సోషల్ మీడియాలో పాపులర్ ఇయ్యింది. మీ కోసం ఆ పాట.


Read More

Thursday, November 09, 2017

Mana Kamareddy

మీ కళ్ళకు నీళ్ళు తెప్పించే వీడియో..!

ఈ వీడియో చూస్తే మీ మీ తల్లిదండ్రులపైన, గురువులపైన అమితమైన గౌరవం పెరగటంతో పాటు కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి.


Read More