జియో సరికొత్త ఆఫర్లను ప్రకటించారు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబాని. ప్రారంభించిన మూడు నెలల్లోనే రికార్డులు సృష్టించిందని.. ప్రస్తుతం దేహశవ్యాప్తంగా జియో సిమ్ లను ఐదు కోట్ల 20 లక్షల మంది వినియోగిస్తున్నారని ఆయన తెలిపారు. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత వేగంగా జియో నెట్ వర్క్ అభివృద్ధి చెందుతుందన్నారు. ఆధార్ కార్డు అనుసంధానం చేయటం వలన కొత్త సిమ్ లను కేవలం ఐదు నిమిషాల్లోనే యాక్టివేషన్ చేయగలుగుతున్నామని తెలిపారు. వినియోగదారులు గతంలో ఎదుర్కొన్న కాల్ డ్రాప్ సమస్యను కొంతవరకు అధికమించామని ఆయన తెలిపాడు. ప్రస్తుతం మన దేశంలోనే రిలయన్స్ జియో దేహసంలోనే అతిపెద్ద నెట్వర్క్ ఆపరేటర్ గా అవతరించిందని అయన ప్రకటించారు.
జియో కొత్తగా ప్రకటించిన ఆఫర్ల వివరాలు:
జియో కొత్తగా ప్రకటించిన ఆఫర్ల వివరాలు:
- మొబైల్ నంబర్ పోర్టబలిటీకి అవకాశం
- డిసెంబర్ 31 నుంచి జియో సిమ్ లను కస్టమర్లకు హోమ్ డెలివరీసర్వీస్ ద్వారా ఇంటికి చేరవేయటం
- డిసెంబర్ 4 నుంచి కొత్త జియో కస్టమర్లకు భారీ ఆఫర్లు అదే రోజు నుంచి మార్చి 31 వరుకు ఉచిత సర్వీస్ అందించనున్నారు.
- ఇదివరకే ఉన్న పాత కస్టమర్లకు ‘జియో హ్యాపీ న్యూ ఇయర్’ పేరుతో మార్చి 31 వరకు ఉచిత సేవలు పొడగించనున్నారు.