కామారెడ్డి జిల్లా కేంద్రం అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిపోయింది. కామారెడ్డి పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం దగ్గర హరి హర శ్రీ అయ్యప్ప స్వామి మహా పడి పూజ డిసెంబర్ 11 వ తేది ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అందంగా ఏర్పాటు చేసిన మంటపం సెట్ భక్తులను అమితంగా ఆకట్టుకుంది. ఒకే రోజు ఉదయం, రాత్రి స్వామి వారికి విశేషపూజలు జరపడంతో పట్టణ వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి, శబరీ మలై సన్నిధానం అర్చకుడు ఉన్ని కృష్ణన్, నూకల ఉదయ్ గురు స్వామి తోపాటు వేల సంఖ్యలో స్వాములు, భక్తులు పాల్గొన్నారు.