కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సోమవారం మిలాద్ ఉన్ నబీ (మహమ్మద్ ప్రవక్త జయంతి )పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా కామారెడ్డి పట్టణంలో ముస్లిం సోదరులు ఒంటెలతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కామారెడ్డి డిఎస్పీ భాస్కర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యాన్ని ఎప్పటి లాగే కాపాడుతూ కలిసి మెలిసి పండగ జరుపుకోవాలని కోరారు.