తెలంగాణ బిడ్డ, క్రమశిక్షణకు మారుపేరైన ఐఏఎస్ ఆఫీసర్ శ్రీమతి బి.చంద్రకళ. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా మెజిస్ట్రేట్‌గా ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్‌గా ఫైర్‌బ్రాండ్ అన్న ఇమేజ్ సంపాదించిన చంద్రకళ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ డ్రీమ్ టీమ్‌లో చోటు సంపాదించారు.
2008వ బ్యాచ్‌కు చెందిన యూపీ క్యాడర్ ఆఫీసర్ రెండేళ్ల క్రితం సంచలనంగా మారారు. ఉత్తరప్రదేశ్ లోని బులందర్‌షెహర్ జిల్లాలో నాసిరకం రోడ్లు వేసిన కాంట్రాక్టర్లపై , మున్సిపల్ అధికారులపై ఆమె ఓసారి సీరియస్ అయ్యారు. ఆ ఘటన సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటనతో ఆమె నిజాయితీ గల ఆఫీసర్ అన్న పేరు తెచ్చుకున్నది. కలెక్టర్ గా ఆమె పనిలో పారదర్శకతను గుర్తించిన ప్రధాని మోడీ ఆమెకు అరుదైన గుర్తింపు ఇచ్చారు.
ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్‌కు ఐఏఎస్ ఆఫీసర్ చంద్రకళను డైరక్టర్‌గా నియమించారు. మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ శాఖలోను ఆమెకు ఉప కార్యదర్శి బాధత్యలను కూడా అప్పగించారు. కలెక్టర్ గా బులందర్‌షెహర్, బిజ్నూర్, మీరట్ నగరాల్లో క్లీన్ ఇండియా ప్రచారాన్ని ఆమె సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు. ఇది అలా ఉండగా ఐఏఎస్ చంద్రకళది తెలంగాణ లోని మన పక్కనే వున్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కావడం విశేషం.