కామారెడ్డి డిగ్రీ కళాశాల పేరిట వున్న 148 ఎకరాలను భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి జరిగిందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ సత్యనారాయణ గారు తెలిపారు. ఈరోజు మధ్యాన్నం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిగితా 14 ఎకరాల భూమి విషయంలో కూడా ప్రభుత్వం అవసరమైతే పై కోర్ట్ కి వెళ్తుందని స్పష్టం చేశారు. కళాశాల ఆస్తుల రిజిస్ట్రేషన్ పూర్తి కావటం పట్ల విద్యార్ధి సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావటానికి కృషి చేసిన కళాశాల పూర్వ విద్యార్థి, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ గారిని, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారిని, మాజీ ఎమ్మెల్యే షబ్బీర్ అలీ గారిని అలాగే వివిధ విద్యార్ధి సంఘాల నాయకులను, జేఏసీ నాయకులను పలువురు అభినందించారు.