రిలయన్స్ జియో కస్టమర్లకు కొత్త బంపర్ ఆఫర్లు ప్రకటించింది. జియో ప్రైమ్ గడువును మరో 15 రోజులు పెంచారు అధినేత ముఖేష్ అంబానీ. జియో వెల్ కం ఆఫర్, హ్యాపి న్యూ ఇయర్ లతో ఇప్పటి వరకు ఆఫర్లను ప్రకటించిన జియో కొత్తగా మరో ఆఫర్ తో ముందుకు వచ్చింది.
జియో ప్రైమ్ మెంబర్ షిప్ కోసం మార్చి 31 వరకు గడువు విధించిన రిలయన్స్… ఆ గడువును ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. ఇప్పటి వరకు జియో ప్రైమ్ మెంబర్షిప్ లో 7 కోట్ల 20 లక్షల మంది కస్టమర్లు చేరారు. జియోలో చేరి స్పెషల్ రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు సమ్మర్ సర్ప్రైస్ పేరుతో మరో రెండు నెలలపాటు ఉచిత బంపర్ ఆపర్ ను ప్రకటించింది రిలయన్స్ జియో. ఏప్రిల్ 15 లోపు రూ. 99+303 రీఛార్జ్ చేసుకున్న వాళ్లకు మొత్తం మూడు నెలలపాటు పాటు జియో ఉచిత సర్వీసులను పొందే అవకాశాన్ని కల్పించింది.
ఈ స్పెషల్ రీఛార్జ్ తో రెండు నెలలు రీఛార్జ్ చేసుకోవాల్సిన పనిలేదు. ఈ స్పెషల్ రీచార్జ్ ను ఏప్రిల్ 15 లోపు చేసుకున్న కస్టమర్లకు కూడా రెండు నెలల ఉచిత సర్వీసులు లభిస్తాయని ప్రకటించింది జియో.