ఫోన్‌కాల్ రికార్డ్ చేయొద్దు..
ఇతరులతో ఫోన్ మాట్లాడేటపుడు వారి సంభాషణలను రికార్డు అసలే చేయొద్దు. ఫోన్ కాల్ రికార్డింగ్ కోసం యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలిస్తే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. అవతలి వ్యక్తి అనుమతి లేకుండా రికార్డింగ్ చేస్తే కఠినమైన శిక్షలు విధిస్తామని అధికారులు చెబుతున్నారు. ఓ వ్యక్తి వ్యక్తిగత విషయాలపై సోషల్ మీడియా వేదికగా కామెంట్స్, ఫోటోలు పెట్టడం, పిచ్చి పిచ్చి వార్తలు ప్రచారం చేయడం వంటివి కూడా శిక్షార్హమే.
వలసదారులకు కూడా దుబాయిలో డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తున్నారు కదా అని ఎక్సలేటర్‌పై కాలు పెట్టి రయ్యిమంటూ దూసుకెళ్తే.. అటు నుంచి అటే జైలు గోడల్లోకి వెళ్తారు. యూఏఈలోని ట్రాఫిక్ చట్టాలను క్షుణ్ణంగా తెలుసుకుని మాత్రమే డ్రైవింగ్ చేయాలి. రెడ్ సిగ్నల్ దాటితే 800 దిర్హమ్స్ జరిమానాతోపాటు 15 రోజుల పాటు వాహనాన్ని పోలీసుల దగ్గరే పెట్టుకుంటారు. గంటకు 60 కిలోమీటర్ల వేగానికి మించితే 1000 దిర్హమ్స్‌ను జరిమానాగా చెల్లించాలి. అంతేకాకుండా 30 రోజుల పాటు వాహనం మీ చేతుల్లోకి రానట్లే.
వీసా లేకుంటే వర్క్ చేయొద్దు
వీసా లేకుండా యూఏఈలోకి అడుగుపెట్టడం, దేశంలో పనిచేయడం వంటివి అక్రమం మాత్రమే కాదు.. నేరపూరితం కూడా. వర్క్ వీసా ఉంటేనే పనిచేయాల్సి ఉంటుంది. ఏదో ఒక వీసాపై దేశంలోకి వచ్చి పని చేస్తానంటే అక్కడ కుదరదు. ఉద్యోగాన్ని సంపాదించి, కంపెనీతో అన్ని వివరాలు మాట్లాడుకుని మళ్లీ స్వదేశం వెళ్లి.. కంపెనీ వర్క్ వీసాకు దరఖాస్తు చేసుకుని మాత్రమే దేశంలోకి అడుగుపెట్టాలి. పని చేయాలి.
వేసుకునే దుస్తుల విషయంలో..
సౌదీలో కూడా మహిళలకు దుస్తుల విషయంలో కఠిన నిబంధనలు ఉన్నాయనీ, డ్రస్‌కోడ్ గురించి వీసాపై సంతకం పెట్టించుకుంటారనేవి అపోహలు మాత్రమే. కాకుంటే ఆ దేశ సంప్రదాయాలకు అనుగుణంగా దుస్తులను ధరించాల్సి ఉంటుంది. ప్రార్థన మందిరాలు, షాపింగ్ మాల్స్, హోటల్స్ వంటి చోట్ల దేశ సంప్రదాయానికి విరుద్ధంగా దుస్తులు ధరించకూడదు.
ఏది ఏమైనా మన ప్రాంతం నుండి పనిచేయటానికి దుబాయ్ లాంటి దేశాలకు వెతున్న నిరుద్యోగ యువకులారా.. జర భద్రం..