రెండు ప్రపంచాలు
నారాయణ కొడుకు అర్ధరాత్రి దాకా ఎక్కడ ఎందుకు వున్నాడో చూచాయగా కూడా తెలియనివ్వరు. ముందు కార్లలో ఎవరెవరు వెళ్తున్నారో కూడా తెలియదు. వాళ్ళ తాగుడు గురించి ఒక్క వార్త కూడా ఉండదు. కనీసం ప్రజలకు ఆ ఊహ కూడా కలగనివ్వరు. ప్రమాదానికి ముందు ఫోన్లలో ఎవెరెవరు ఏమేమి మాట్లాడుకున్నారో కూడా ఒక్క ముక్క కూడా రాదు. వాళ్ళ WhatsApp మెసెంజర్లలో ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు.
అప్పుడొక ఘోర విషాదం జరిగినట్టు, రాకుమారుడు అర్ధాంతరంగా మరణించినట్టు బాధ. వాళ్ళ కుటుంబాలకు ఏ మాత్రం ఇబ్బంది, embarrassment, అవమానం కలుగకూడదు. పరువుకు భంగం కలగకూడదు.
పత్రికలకు, ఛానెళ్లకు ఆ విషయాలు అప్పుడు ప్రస్తుతం.
కానీ ఇప్పుడు minute-by-minute ఏం జరిగిందో పత్రికల నిండా, చానెళ్ల నిండా చూపిస్తున్నారు. అక్రమ సంబంధాలు, ట్విస్టులు, నేరపూరిత విలాసజీవితాల కోసం వెంపర్లాడిన మనుషులు. పోలీసులు, చానెళ్లు ప్రత్యక్ష సాక్షుల వలె వివరిస్తున్నారు. వర్ణిస్తున్నారు. Scene ని కళ్ళకు కట్టినట్టు reconstruct చేసి చూపిస్తున్నారు. ఆమెకి, ఆమె కుటుంబానికి అసలు privacy అవసరం లేదు. వాళ్లకు embarrassment కలిగినా పర్వాలేదు.
లేకపోతే మృతురాలు శిరీష బిడ్డ దగ్గరికి వెళ్లి మీ అమ్మ ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడేదా అని తల్లి ని పోగొట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ చిట్టి తల్లిని అడిగితే ఆ బిడ్డ ఏం చెప్తది..?? ఇంతకన్నా ఘోరం ఉంటుందా...??
మీడియా మిత్రులారా, జనాలను ఇలా బాధపెడుతూ..బాధతో సగం చచ్చిన వాళ్ళని మొత్తం చంపేయొద్దు సుమా..