ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్ష్యతన సమావేశమయిన రాష్ట్ర క్యాబినెట్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్టంలో టీఎస్ వ్యాలెట్ పేరుతో ఓ మొబైల్ యాప్ ను రూపొందించి త్వరలోనే ప్రజలందరికి అందుబాటులోకి తీసుకువస్తామని, దీని వల్ల భవిష్యత్ లో నోట్లు అవసరం వున్నా లేక పోయిన ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. దీంతో పాటు సిద్దిపేట నియోజకవర్గాన్ని మోడల్ గా తీసుకుని క్యాష్ లెస్ నియోజకవర్గంగా చేస్తామని, దానిలో ఎదురయ్యే అనుభవాలతో తెలంగాణ మొత్తానికి అమలు చేస్తామని కేసీఆర్ వెల్లడించారు.