కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పేరిట స్థలాల,ఆస్తుల రిజిస్ట్రేషన్ చేసి, ఆ కళాశాల స్థలాలలో నూతన విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కొన్ని సంవత్సరాలుగా విద్యార్థి సంఘాలు చేస్తున్న ఉద్యమానికి మద్ధతు తెలుపడానికి, ఐఏఎస్ ఆఫిసర్ స్మిత సబర్వాల్ తరపున అవుట్ లుక్ మ్యాగజైన్ పై పోరాటం చేసి ఈ మధ్యే కొమురవెల్లి మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ముంపు రైతుల పక్షాన జిఓ నెం 123 కి విరుద్ధంగా న్యాయ పోరాటం చేసిన ప్రముఖ న్యాయవాది, మన కామారెడ్డి జిల్లా ఆడబిడ్డ, నాగిరెడ్డిపేట వాస్తవ్యురాలు రచనారెడ్డి గారు శనివారం కామారెడ్డికి రానున్నారు. ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల స్థలాల, ఆస్తుల విషయంలో న్యాయ పోరాటానికి సిద్దమవుతున్న నేపథ్యంలో రేపు అనగా తేది 04-02-2017 శనివారం నాడు ఉదయం 10 గంటలకి కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో సమావేశమవుతారు.