అతి చిన్న వయసులో ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తెలంగాణ ముద్దు బిడ్డ, నిజామాబాద్ జిల్లాకి చెందిన పూర్ణ మాలావత్ దేశ వ్యాప్తంగా ప్రశంసలందుకుంది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలకేంద్రంలో వున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న పూర్ణ గురించి ఒక బయో పిక్ (సినిమా) త్వరలో హిందిలో వెండి తెరపై రాబోతుంది. పూర్ణ అనే పేరుతో బాలికలు ఏదైనా సాధించగలరు అనే కాప్షన్ తో తెరపై రాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బయో పిక్ ట్రైలర్ ని ఈ మధ్యనే విడుదల చేసారు. ఈ చిత్రం వచ్చే మార్చి నెలలో విడుదల కానుంది. ఆ ట్రైలర్ మీకోసం..