Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Tuesday, March 07, 2017

Mana Kamareddy

అద్భుతం..మహాద్భుతం మహారాష్ట్ర లోని శ్రీ కైలాస ఆలయం..


ప్రపంచంలోనే ఆధాత్మికతకు పెట్టింది పేరైన భారతదేశంలో అద్భుత కళాఖండాలకు కొదువలేదు. ఆ అద్భుత కళాఖండాలలో ఒకటే మన పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో ఎల్లోరా గుహాలలో వున్న కైలాస్ మందిర్. ఆ ఆలయంలో ప్రతిది ఒక అద్భుతమే. రాష్ట్రాకుటుల కాలంలో 8 వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయ నిర్మాణం ఇప్పటికి చరిత్రకారులకి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. సుమారు 100 ఫీట్ల ఎత్తు వుండే ఆలయం మొత్తం ఒకే ఒక రాయి నుండి చెక్కబడింది. ఈ ఆలయం నిర్మిస్తున్నపుడు సుమారు 4 లక్షల టన్నుల రాయిని తొలగించి అద్భుత కళాఖండంగా మలిచారు కళాకారులు. ఆలయం మొత్తం ఏనుగుల మోస్తూ ఉన్నట్టు ఉంటుంది. ఆలయ గోడలపై చెక్కిన దేవత మూర్తుల విగ్రహాలు చూస్తే దైవ లోకంలో ఉన్నామా అన్న అనుభూతి కలిగితుంది. ప్రధాన ఆలయం ముందు 16 ఫీట్ల ధ్వజస్తంభం చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇలా ఒకటి కాదు ఈ ఆలయంలో ప్రతిదీ అద్భుతమే. 

ఈ ఆలయంపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో డాక్యూమెంటరీలు వచ్చాయి. ఇంత పెద్ద ఆలయాన్ని కేవలం 18 సంవత్సరాల కాలంలో నిర్మించటమే అతి పెద్ద మిస్టరీ. అలా ఉంటుంది ఆలయాన్ని చెక్కిన తీరు. సాక్షాత్తు విశ్వకర్మ భాగవానుడే అప్పటి కళాకారుల చేతుల మీదుగా ఇంత పెద్ద మహాద్భుతాన్ని సృష్టించడేమో అనే సందేహం కలుగక మానదు. ఇంతటి మహోన్నత ఆలయం తర్వాత కాలంలో మహమ్మదీయ రాజుల దండయాత్రల కారణంగా కొంత శిథిలమైన, కళాకారుల నైపుణ్యం మాత్రం జీవం ఉట్టిపడేలా కళ్ళముందు దర్శనమిస్తుంది. 

ఈ ఆలయం గురించి సంక్షిప్తంగా ఒక వీడియో మీ కోసం..



Article by ManaKamareddy 



Subscribe to this Mana Kamareddy Portal via Email :