(మన కామారెడ్డి 14 March) కామారెడ్డి డిగ్రీ కళాశాల ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ తొందరగా పూర్తి చేసేలా చొరవ చూపాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చంద్రశేఖర్, మరియు జిల్లా నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టరు శ్రీ సత్యనారాయణ గారిని ఈరోజు కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత సంవత్సరం ముఖ్యమంత్రి కెసిఆర్ గారు కళాశాల ఆస్తుల విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చిన, ఆ తర్వాత జరిగిన కళాశాల వార్షికోత్సవంలో విద్యా శాఖ మంత్రి శ్రీ కడియం శ్రీహరి గారు కూడా స్పష్టమైన హామీ ఇచ్చిన ప్రక్రియ ముందుకు సాగాకపోవటంపై ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా విద్యార్థి సంఘాలు చేస్తున్న తీవ్ర ఆందోళనల దృశ్య 2 నెలల క్రితం విద్యాశాఖ మంత్రి, ప్రినిపాల్ సెక్రటరీ, జిల్లా మంత్రి పోచారం, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మరియు కామారెడ్డి కలెక్టర్ లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆస్తుల రిజిస్ట్రేషన్ కి వున్న అడ్డంకులు తొలగించాలని ఆదేశించిన ప్రక్రియ ముందుకు సాగటంలేదన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గారు స్పందిస్తూ, పూర్వ విద్యార్థిగా కళాశాల ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేసేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ జిల్లా ఇంచార్జి రాహుల్ నేత, హేమంత్, జశ్వంత్, రాజేష్ మరియు నవీన్ తదితరులు పాల్గొన్నారు.