కామారెడ్డి మున్సిపాలిటీ, అందులో అధికారుల గురించి ఒక మెసేజ్ ఈ మధ్య చక్కర్లు కొడుతోంది.
''అలసత్వ అధికారులు ఇకనైనా మున్సిపల్ ను వీడేనా? ఇకముందైనా సమర్థవంతమైన అధికారులకు చోటు లభించేనా? '' అనే టైటిల్ తో మెసేజ్ ప్రారంభమౌతుంది. ఈ మెసేజ్ లో నిజానిజాలు ఎలా వున్నా మీ కోసం పోస్ట్ చేస్తున్నాం..
''అలసత్వ అధికారులు ఇకనైనా మున్సిపల్ ను వీడేనా? ఇకముందైనా సమర్థవంతమైన అధికారులకు చోటు లభించేనా? '' అనే టైటిల్ తో మెసేజ్ ప్రారంభమౌతుంది. ఈ మెసేజ్ లో నిజానిజాలు ఎలా వున్నా మీ కోసం పోస్ట్ చేస్తున్నాం..
✍తెలంగాణా రాష్ట్రంలో నూతన జిల్లాగా ఆవిర్భవించిన కామారెడ్డి.
✍జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ త్వరలోనే 'కుడా'(KUDA) గా రూపాంతరం చెందే సువర్ణావకాశం.
✍కామారెడ్డి ప్రజల గొంతుకలు ఆలకించేదెవ్వరు?ప్రజల ఆకాంక్షలు నెరవెరేదెప్పుడు?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలనను మరింత చేరువ చేయడంలో భాగంగా నూతన జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం నిజామాబాద్ జిల్లాలో భాగమైన కామారెడ్డి కొత్త జిల్లాగా ఆవిర్భవించడం శుభపరిణామం.
ఎంతటి అద్భుత ఆలోచనలైనా కార్యరూపం దాల్చాలంటే సమిష్టి కృషి అవసరం.కామారెడ్డి జిల్లాగా ఆవిర్భవించడంతో పట్టణానికి మహర్దశ వస్తుందని, మరింత పారదర్శక పాలన అందుతుందని, మరిన్ని ఆవిష్కరణలు జరుగుతాయని ఆశించిన కామారెడ్డి ప్రజానీకానికి స్థానిక మున్సిపల్ ముఖ్యఅధికారుల పనితీరు తీవ్ర నిరుత్సాహాన్ని కలిగిస్తుంది.
జిల్లా సమగ్రాభివృద్దితో బాటు సమానంగా పట్టణాభివృద్ది జరగాల్సిన సందర్భంలో మున్సిపల్ లో జరుగుతున్న అలసత్వాన్ని కట్టడి చేయడానికి గానూ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ గా జాయింట్ కలెక్టర్ గారిని జిల్లా ఉన్నతాధికారిగా నియమించడం ప్రజలకు కొంతలో కొంత ఊరటనిచ్చే అంశం.కానీ దురదృష్టవశాత్తు కమీషనర్ గా వ్యవహారిస్తున్న అధికారి జె.సి గారి సలహాలు,సూచనలు అమలు చేయకపోయినట్లు,కొన్ని సందర్భాల్లో జె.సి గారి నిర్ణయాలు సైతం ధిక్కరించే పరిస్థితులు ఉత్పన్నమైనట్లు, పట్టణ పురోభివృద్దిని పక్కన పెట్టి మున్సిపల్ లో ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తున్న కొందరి చేతుల్లో కీలుబొమ్మగా మారినట్లు వారి స్వార్థ ప్రయోజనాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా కామారెడ్డి జిల్లాగా ఏర్పడినప్పటికీ ఆ ఫలాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందే పరిస్థితి కనుమరుగవుతున్నాయి.
కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి "కుడా''(KUDA)గా రూపాంతరం చెందే దశలో ఇటువంటి అలసత్వ అధికారుల వ్యవహార శైలి వల్ల జరుగబోయే నష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం సదరు అధికారిపై బదిలీ వేటువేయడం ద్వారా కామారెడ్డి పట్టణ అభివృద్దికి కట్టుబడి వున్నట్లు దానికి తగిన చర్యలు సైతం తీసుకోబోతున్నట్లు వర్తమానం పంపినట్లయ్యింది.
దురదృష్టవశాత్తు ఒకవైపు జిల్లా పాలనాధికారి పట్టణాన్ని అన్ని రంగాల్లో మోడల్ గా తయారు చేయాలనే సంకల్పంతో తీసుకుంటున్న చర్యలు మున్సిపల్ అక్రమ సంపాదనకు,అవినీతి సొమ్ముకు అలవాటు పడ్డ కొందరు ప్రజాప్రతినిధులకు ఇన్ని రోజులు అండగా వున్న మున్సిపల్ ముఖ్య అధికారి బదిలీ కంటగింపుగా మారినట్లయ్యింది.
అభివృద్ధికి అండగా - అవినీతికి దూరంగా ఉండాల్సిన సంఘాలు కులం పేరుతో కొందరు మరియు తమ అక్రమ సంపాదనను నిరాటంకంగా కొనసాగించడానికి పలువురు ప్రజాప్రతినిధులు కమీషనర్ బదిలీని అడ్డుకునే ప్రయత్నం చేయడం భవిష్యత్తులో కామారెడ్డి పట్టణానికి జరగబోయే అభివృద్దిని ఆపడమే అవుతుందని కామారెడ్డి ప్రజానికం భావిస్తుంది.
ఇప్పడిప్పడే జిల్లా కేంద్రమై అభివృద్దికి అడుగులు పడుతున్న వేళ సమర్థవంతమైన అధికారులతోనే
సుపరిపాలన సుసాధ్యమవుతుందని,ప్రజల సంక్షేమమే పరమావధిగా,అభివృద్ధే ధ్యేయంగా జిల్లా పాలనాధికారి గారు తీసుకున్న కమీషనర్ బదిలీ నిర్ణయం సబబేనని,మరింత సమర్థవంతమైన అధికారి నియామకం వీలైనంత త్వరలో అందుబాటులోకి రావాలని కామారెడ్డి ప్రజానికం ఆశిస్తుంది..
ఇట్లు
కామారెడ్డి ప్రజలు.
Source: Whatsapp