దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన భిక్కనూరు శ్రీ సిద్దరామేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని ఎంతో అందంగా ముస్తాబు చేశారు. ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలలో చుట్టూ పక్కల జిల్లాల నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా అనేక సంఖ్యలో భక్తులు పాల్గొనున్నారు.
బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదు రోజులపాటు జరిగే కార్యాక్రమాలు..
తేది 18-03-2017 శనివారం రోజున
- పుణ్యాహవాచనం
- మాతృకానాంది
- అంకురార్పణ
- అఖండ దీపారాధన
- స్వామి వారికి రుద్రాభిషేకం
- భువనేశ్వరి దేవి అమ్మవారికి కుంకుమార్చన
- భిక్కనూరు పట్టణంలో వున్న సిద్దగిరి సమాధి వద్దకు ఆలయం నుండి ఊరేగింపు.
తేది 19-03-2017 ఆదివారం రోజున
- అగ్ని ప్రతిష్ఠ
- ధ్వజారోహణం
- సాయంత్రం అందంగా అలంకరించిన ఎడ్ల బండ్లతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ
- రాత్రి 11 గంటల వీరభద్ర ప్రస్థానం
- అర్ధరాత్రి 2 గంటలకు అగ్ని గుండాలు
తేది 20-03-2017 సోమవారం రోజున
- ఆలయ మహంత్ ఆధ్వర్యంలో సిద్దరగిరి సమాధులు వద్దకు వెళ్ళుట
- శ్రీ సిద్దరామేశ్వర స్వామి వారి కళ్యాణం శ్రీ భువనేశ్వరి మాతతో..
- అదే రోజు ఆలయ మహంత్ విభూతిదారుడై, సిద్దగిరి సమాధుల నుండి ఆలయానికి వచ్చే కార్యాక్రమం.
- రాత్రి విమాన రథోత్సవం
తేది 21-03-2017, 22-03-2017 మంగళ, బుధవారం రోజులలో..
వివిధ సాహిత్య కార్యాక్రమాలు, భజన కార్యక్రమాలు,
చివరగా బుధవారం నాడునాక బలి, క్షేత్రపాలక బలి, పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.