|
ఈరోజు కలెక్టరేట్ లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న కామారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులు |
మన కామారెడ్డి : కామారెడ్డి డిగ్రీ కళాశాల ఆస్తుల విషయంలో గత మూడు నాలుగు నెలలుగా సాగుతున్న ఉద్యమాల కృషి ఫలితంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయ్యే దశకి వచ్చింది. సోమవారం ప్రారంభమైన విద్యార్ధి సంఘాలు ఆమరణ దీక్ష ఫలితం అంతకుముందే కళాశాల పూర్వ విధ్యార్థి రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు చంద్రశేఖర్ మరియు నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు హైదరాబాద్ వెళ్ళి అక్కడ చేసిన అవిశ్రాంత కృషితోపాటు నిన్న సాయంత్రం శాసన మండలి విపక్షనేత షబ్బీర్ అలీ ఆమరణ దీక్ష శిబిరాన్ని సందర్శించిన తర్వాత షబ్బీర్ అలీ గారు కళాశాల స్థల ఆస్తుల రిజిస్ట్రేషన్ విషయంపై ఫోన్ లో ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖామాత్యులు మహామూద్ అలీ తో సైతం మాట్లాడిన తర్వాత మహాముద్ అలీ గారు ఈ రోజు ఎలాగైన పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఒక కొలిక్కి వచ్చినట్లయ్యింది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రానికి జిల్లా కలెక్టర్ దీక్షా స్థలికి రిజిస్ట్రేషన్ కాపీలు తీసుకొని వచ్చి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులచే దీక్ష విరమింపజేసే అవకాశం వుంది.
ఫ్లాష్ న్యూస్..
కామారెడ్డి డిగ్రీ కళాశాల పేరిట 148ఎకరాలను ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసిందని ఈరోజు మధ్యాన్నం జరిగిన విలేకర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీ సత్యనారాయణ గారు తెలిపారు. మిగితా 14 ఎకరాల భూమి విషయంలో ప్రభుత్వం అవసరమైతే పై కోర్ట్ కి వెళ్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
కామారెడ్డి డిగ్రీ కళాశాల స్థల,ఆస్తుల వ్యవహారంలో ఎప్పటికప్పుడూ నిరంతరంగా,అవిశ్రాంతంగా కృషి చేసిన డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థి కామారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ సత్యనారాయణ గారికి అలాగే వివిధ విద్యార్ధి సంఘాల నాయకులకు, జేఏసీ నాయకులకు మన కామారెడ్డి తరపున ప్రత్యేక అభినందనలు.