Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks
Showing posts with label About Kamareddy. Show all posts
Showing posts with label About Kamareddy. Show all posts

Sunday, August 11, 2019

Mana Kamareddy

ఇండియా జోలికొస్తే తాట తీస్తాం: పాక్ ను హెచ్చరించిన ఇజ్రాయిల్

భారత్ - ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల మధ్య బలమైన మిలిటరీ సంబంధాలు ఉన్నాయి. ఇండియా ఎవరినీ నమ్మినా నమ్మకపోయినా.. ఇజ్రాయెల్ ను మాత్రం పక్కాగా నమ్ముతుంది అలాగే భారత్ ఆంటే ఇజ్రాయెల్ కు ఎనలేని ఇష్టం ఎందుకంటే దానికి కారణం లేకపోలేదు ఇజ్రాయిల్ లో యూదులు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఆనాడు యూదులకు భారత్ ఆశ్రయం ఇవ్వటం వల్ల వారంతా ఒక దేశంగా ఏర్పడిన తరువాత భారత్ మీద ఎంతో అభిమానాన్ని పెంచుకున్నారు. ఇజ్రాయిలీ పౌరుడు జీవితంలో ఒక్క సారైనా భారత్ ను సందర్శించాలని కలలు కంటాడు. అందుకే భారత్ అంటే ఇజ్రాయిల్ కు ఎనలేని గౌరవం, అభిమానం.

ఇజ్రాయిల్ భారత్ నుంచి ఏమి ఆశించని గొప్ప మిత్ర దేశం. మిగతా దేశాలు రష్యా, అమెరికా తమ స్వార్ధ ప్రయోజనాలును చూసుకుంటుంది గాని నిజమైన మిత్ర దేశాలుగా మెలగవు. ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి కూడా మోడీ బొమ్మతో ఎన్నికలకు వెళ్లాడంటే అర్ధం చేసుకోవచ్చు. ఇజ్రాయిల్ లో భారత్ దేశం మీద ఎంత ప్రేమ ఉందో !

ఇండియా జోలికొస్తే పాక్ తాట తీస్తాం: ఇజ్రాయెల్

కాశ్మీర్ విషయంలో పాక్ స్పదించిన తీరు, ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇజ్రాయిల్ కు కోపం తెప్పించాయి ఇండియా పక్షాన ఎవరు నిలబడినా నిలబడకపోయినా తాము నిలబడతామని, కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమని, భారత్ జోలికి వస్తే తాట తీస్తామని పాక్ ను హెచ్చరించింది.
ఒకవేళ పీఓకేలో ఉగ్రవాదులను ఏరివేయడానికి భారత్ వెళ్తే తాము కూడా తమ సైన్యాన్ని తోడుగా పంపిస్తామని తేల్చి చెప్పింది.
భారత్ కు ప్రపంచ దేశాల మద్దతు రోజురోజుకు పెరగడంతో పాక్ లోలోపల తీవ్ర మదన పడుతుంది.

Read More

Friday, August 02, 2019

Mana Kamareddy

ప్రసిద్ధ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి (యాదాద్రి) దేవస్థానం అభివృద్ధి పనుల దృశ్యాలు..


తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి (యాదాద్రి) దేవస్థానం అభివృద్ధి  పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 


Read More

Wednesday, October 17, 2018

Mana Kamareddy

ప్రపంచాన్నంతటినీ కన్నీళ్ళు పెట్టించిన వాస్తవ కథ..

మా అమ్మకు ఒక్క కన్నే ఉండేది. మా అమ్మంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది. ఆమె ఓ చిన్న కొట్టు నడుపుతుండేది ఒక రోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవడానికి స్కూల్ కి వచ్చింది. ఇంక అప్పట్నించి చూడండి. ”మీ అమ్మ ఒంటి కన్నుది” అని స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు, అవహేళనలు.అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే. అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టానబ్బా అనిపించేది. ఒక్కోసారి నాకు.అసలామె ఈ లోకం నుంచే ఒక్కసారిగా అదృశ్యమైపోతే బావుణ్ణు. అనిపించేది.
“అమ్మా నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీవల్ల నేను అందరికీ చులకన అయిపోయాను. నువ్వు చచ్చిపో!” కోపంగా అరిచేసే వాణ్ణి.

ఆమె మొహంలో నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనిపించేదికాదు. నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చేది. అయినా సరే అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడలేని సంతోషంగా ఉండేది. ఆమె నన్ను ఎప్పుడూ దండించలేదు కాబట్టి ఆమెను నేను ఎంతగా భాధ పెట్టానో నాకు తెలియదు.ఒక రోజు రాత్రి యధాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాను. మద్యలో దాహం వేసి మెలుకువ వచ్చింది. నీళ్ళు తాగడానికి వంటగదిలోకి వెళ్ళాను. అమ్మ అక్కడ ఒంటరిగా రోదిస్తోంది. మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక్క కంటిలోంచే నీళ్ళు. నా సహజ స్వభావం ఎక్కడికి పోతుంది? మొహం తిప్పుకుని వెళ్ళిపోయాను. ఎక్కడికొచ్చినా నన్ను అవమానాలు పాలు చేసే మా అమ్మను, మా పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతుణ్ణవ్వాలనీ, బాగా పేరు సంపాదించాలనీ కలలుగంటూ నిద్రపోయాను.

ఆ తరువాత నేను చాలా కష్టపడి చదివాను. పై చదువుల కోసం అమ్మను వదిలి వచ్చేశాను. మంచి విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను. బాగా డబ్బు సంపాదించాను. మంచి ఇల్లు కొనుక్కున్నాను. మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకున్నాను. నాకిప్పుడు ఇద్దరు పిల్లలు కూడా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా జీవితం గడిచిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఒంటికన్ను అమ్మ లేదుకదా!

అలా ఎడతెరిపిలేని సంతోషాలతో సాగిపోతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చింది మహాతల్లి. ఇంకెవరు? మా అమ్మ. ఆమె ఒంటి కన్ను చూసి రెండేళ్ళ నా కూతురు భయంతో జడుసుకుంది. “ఎవరు నువ్వు? ఎందుకొచ్చావిక్కడికి? నువ్వెవరో నాకు తెలియదు. నా ఇంటికొచ్చి నా కూతుర్నే భయపెడతావా?ముందు నువ్వెళ్ళిపో ఇక్కడ్నుంచి!!!” సాధ్యమైనంతవరకు తెలియనట్లే నటించాను.

“క్షమించండి బాబూ! తెలియక తప్పుడు చిరునామాకి వచ్చినట్లున్నాను” ఆమె అదృశ్యమైపోయింది. “హమ్మయ్య ఆమె నన్ను గుర్తు పట్టలేదు”. భారంగా ఊపిరి పీల్చుకున్నాను. ఇక ఆమె గురించి జీవితాంతం పట్టించుకోనవసరం లేదు అనుకున్నాను.

కానీ కొద్దిరోజులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని ఒక ఆహ్వాన పత్రం అందింది నాకు. వ్యాపార నిమిత్తం వెళుతున్నానని మా శ్రీమతికి అబద్ధం చెప్పి అక్కడికి బయలు దేరాను. స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళాను. ఎంత వద్దకున్నా నా కళ్ళు లోపలి భాగాన్ని పరికించాయి. మా అమ్మ ఒంటరిగా కటిక నేలపై పడి ఉంది. ఆమె చేతిలో ఒక లేఖ. నా కోసమే రాసిపెట్టి ఉంది. దాని సారాంశం.

ప్రియమైన కుమారునికి,
ఇప్పటికే నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువే బతికాను. నేనింక నీవుండే దగ్గరికి రాను. కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా! ఏం చేయమంటావు? నిన్ను చూడకుండా ఉండలేకున్నాను. కన్నపేగురా. తట్టుకోలేక పోతోంది. నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నావని తెలిసిన నా ఆనందానికి పట్టపగాలు లేవు. కానీ నేను మాత్రం నీకోసం స్కూల్ దగ్గరికి రానులే. వస్తే నీకు మళ్ళీ అవమానం చేసినదాన్నవుతాను. ఒక్క విషయం మాత్రం ఇప్పటికి చెప్పక తప్పడం లేదు. చిన్నా! నీవు చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు ఒక ప్రమాదంలో నీకు ఒక కన్నుపోయింది. నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఒక కంటితో చూడలేకపోయాన్రా కన్నా! అందుకనే నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను. నా కంటితో నువ్వు ప్రపంచం చూస్తున్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా? నువ్వు చేసిన పనులన్నింటికీ నేను ఎప్పుడూ బాధపడలేదు. ఒక్క రెండు సార్లు మాత్రం ” వాడు నా మీద కోప్పడ్డాడంటే నా మీద ప్రేమ ఉంటేనా కదా!” అని సరిపెట్టుకున్నాను. చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతులు.

ఉత్తరం తడిసి ముద్దయింది. నాకు ప్రపంచం కనిపించడం లేదు.నవనాడులూ కుంగిపోయాయి. భూమి నిలువుగా చీలిపోయి అందులో చెప్పలేనంత లోతుకి వెళ్ళిపోయాను. తన జీవితమంతా నాకోసం ధారబోసిన మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్ళు కారిస్తే సరిపోతాయి? ఎన్ని జన్మలెత్తి ఆమె ఋణం తీర్చుకోను?
Note: ఇది ఇంగ్లీష్ కథకు అనువాదం, అనువాదం చేసిన వారికి ధన్యవాదాలు


Read More

Monday, May 14, 2018

Mana Kamareddy

అమ్మ కన్నీళ్లకు బిడ్డ పశ్చాతాపం ఇది..!


నిన్న మదర్స్ డే సందర్భంగా సోషల్ మీడియా గ్రూపులతో  'అమ్మ' గురుంచి రకరకాల మెసేజ్ లు, అమ్మ తో దిగిన ఫొటోలతో మొత్తం నిండిపోయింది. అలాగే ఒక కొడుకు తన తల్లి పడ్డ బాధలను గుర్తు చేసుకుంటూ కొడుకు చూపిన పశ్చాతాపం, భాధ ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. కాస్త సమయం తీసుకోని మరి ఒక్కసారి చదవండి.


Read More

Friday, February 02, 2018

Mana Kamareddy

మేడారం సమ్మక్క సారక్క జాతర (1950 వ సంవత్సరం నాటి ఫోటోలు)

దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతరైన మన మేడారం సమ్మక్క సారక్క జాతర 1950 వ సంవత్సరంలో ఎలా జరిగిందో క్రింది చిత్రాలలో చూడండి.











Read More

Wednesday, January 31, 2018

Mana Kamareddy

ఈరోజు ఉన్న సంపూర్ణ చంద్ర గ్రహణం యొక్క అద్భుతాలు


ఆకాశంలో నేడు ఒక అద్భుతం జరగబోతోంది. ఎప్పటిలా కాకుండా చంద్రుడు ఒక అరుదైన రూపంలో కనిపించనున్నాడు. ఈరోజు సాయంత్రం 6:21- 7:37, (జనవరి 31) చంద్రుడు సూపర్ బ్లూ బ్లడ్ మూన్ గా దర్శనమివ్వనున్నాడు.

ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి ?

1.  సూపర్ మూన్
2.  బ్లూ మూన్
3.  బ్లడ్ మూన్ లాంటివి జరుగుతాయి.

1)  సూపర్ మూన్ అంటే ఏమిటి ?

అంటే చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్య లో తిరుగుతూ ఉండటం వలన ఒకానొక సమయంలో భూమికి చాలా దగ్గరకు వస్తాడు. అందువలన చంద్రుని సైజు పెరిగి పెద్దది గా కనిపిస్తుంది. 31వతేదీన ఇలాగే చంద్రుని సైజు 14% పెద్దదిగా కనిపిస్తుంది. ఇలా పెద్ద గా కనిపించే చంద్రుని బింబాన్ని సూపర్ మూన్ అంటారు.

సూపర్ మూన్ రోజు ఇలా చంద్రుని సైజు పెరిగి కనిపిస్తుంది.(తెలుపు రంగు)

2) బ్లూ మూన్ అని ఎందుకు అంటారు ?

ఇందులో బ్లూ రంగు ఏమీ లేదు కానీ ఒకే నెలలో రెండు పౌర్ణమీ లు (Full moon) వస్తే దాన్ని శాస్త్ర వేత్తలు బ్లూ మూన్ గా పిలుస్తారు.

క్యాలెండర్‌ ని గమనిస్తే జనవరి 2వ తేదీన ఒకసారి పౌర్ణమి వచ్చిన విషయం, మళ్ళీ జనవరి 31వ తేదీన రెండవసారి పౌర్ణమి రావటమే.

3) చంద్రుడు బ్లడ్ మూన్ గా ఎలా మారుతాడు?

సంపూర్ణ చంద్ర గ్రహణం వలన చంద్రుని మీద డైరెక్ట్ గా  సూర్య  కిరణాలు పడక పోవటం వలన చంద్రుడు ప్రకాశవంతంగా, తెల్లగా ఉండడు. కానీ  భూమి పై పడిన సూర్య కిరణాలు భూమి వాతావరణంలో ని ధూళి, తేమ వలన పరావర్తనం,వికిరణం చెంది వాటిలోని ఎరుపురంగులో కిరణాలు భూమి అంచులనుంచి పోయి చంద్రుని మీద పడతాయి కాబట్టి సంపూర్ణ చంద్ర గ్రహణం రోజు చంద్రుని బింబం ఎరుపు/ ఆరెంజ్/పసుపు రంగు లో కనిపిస్తుంది. అందుకే రక్తం రంగు లో కనిపిస్తుంది కాబట్టి బ్లడ్ మూన్ అని పేరుపెట్టారు. (ఇది రోజూ ఉదయం, సాయంత్రం మనకు సూర్యుడు ఇలాంటి రంగులో కనిపించే విషయం కు సమానం. రెంటికీ కారణం భూమి చుట్టూ ఉన్న  వాతావరణం.)

4) ఇలాంటిది గతంలో ఎప్పుడు జరిగింది ?

ఇలాంటి ఖగోళ ఘట్టం, గతంలో 1866 సం.లో సంభవించింది. తిరిగి 151 సం.ల తర్వాత ఇపుడు, అంటే 31.01.2018 నాడు ఆ పరిస్థితి పునరావృతం ఔతుంది, కాబట్టి ప్రజలందరూ తప్పకుండ  చూసి అనందించాలి. 

5) ఎక్కడి నుంచి చూడవచ్చు:

*భవంతులు, చెట్లు, కొండలు లేని ప్రదేశంలో అయితే చంద్రుడి ని చూడవచ్చు.

*పాఠశాల, కళాశాల విద్యార్థులు మైదానాల్లో బృందం గా కలిసి చూడగలరు.

*ఇంకా స్పష్టంగా కనిపించాలంటే టెలిస్కోప్ ద్వారా చూస్తే ఎర్రని చంద్రుడిని ఎక్కువగా అస్వాదించగలరు.

గ్రహణాల మీద ఉన్న అపోహలు - వాస్తవాలు :

1) చంద్ర గ్రహణం చూడకూడదని అంటారు ఇది వాస్తవమా? ఒక వేళ చూస్తే, కళ్ళతో నేరుగా చూడవచ్చా?

కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రహాలు/ ఉప గ్రహాలు మనిషి కి హాని చేస్తాయని భావించడం ఇది పూర్తిగా అవాస్తవం.

చంద్ర గ్రహణం సందర్భంగా ఏ ప్రమాదకర కిరణాలు వెలువడవు, కాబట్టి ఎలాంటి ఫిల్టర్లు (మన కంటికి అడ్డంబెట్టుకునే) అవసరం లేకుండానే.. మనం, మన మామూలు కంటితో సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని చూడొచ్చు....

2) చంద్ర గ్రహణం సమయంలో ఆహార పదార్థాలను తినకుడదంటారు నిజమేనా?  పదార్థాల లో గరక గడ్డి వేయడం వలన గ్రహణం ప్రభావం ఏమీ ఉండదని భావించడం, ఒక వేళ గరక వేయని పదార్థాలు బయట పారవేయడం. ఇది సరియైనదేనా ...?

నిజము కాదు...
ఆ సమయంలో అల్పాహారం, భోజనం  తీసుకున్నా ఏమి అవ్వదు. ఇవి కేవలం భ్రమలు, మూఢ విశ్వాసము మాత్రమే అవుతుంది. నిజమే అని భావించేవారు మీ ఊరు/పట్టణం లోకి గ్రహణం సమయంలో వెళ్ళి హోటల్లో, మిఠాయి దుకాణా ల్లో , తోపుడు బండ్ల వద్ద ప్రజలు ఆహార పదార్థాలను తింటున్నారో  లేదో గమనించండి. 

ఎందుకంటే, ఉదాహరణకు హోటల్లో వండిన వంటకాలు మిఠాయి దుకాణాలలో తయారు చేసిన మిఠాయిలలో ఎవ్వరూ గరక గడ్డి వేయరు, వేయడం మర్చిపోయినా గ్రహణం ప్రభావం ఉంటుందని, చెడిపోయినవి అని చెత్తకుండీ లో వేయలేరు..... వేయరు కూడా.....

3) గ్రహణం సమయంలో బయట తిరిగితే శరీర అవయవాలు దెబ్బతింటాయని భావించవచ్చా?

భూమి మీద ఆధారపడి మనిషులు మాత్రమే నివసించడం లేదని గ్రహించాలి. జంతువులు, పక్షులు, కీటకాలు, సరీసృపాలు కూడా నివసిస్తున్నాయి.

అలాంటి చెడు ప్రభావాలు ఉంటే వాటి సంగతి ఏమిటో అలోచించండి.

గ్రహణం ప్రభావం ఉంటుంది అనుకునేవారు గ్రహణం సమయంలో మీకు తెలిసిన సమీప పట్టణం లోని షాప్ యజమాని కి పోన్ చేసి బజారులో మనుషులు తిరుగుతున్నారా? లేదా కనుక్కోవటం వలన మీరే ఒక నిర్ధారణకు వస్తారు..... అప్పుడు మీరు నమ్మేది వాస్తవమా?  మేము చెప్పేది వాస్తవమా మీరే తెలుసుకుంటారు. కాబట్టి శరీరం లోపల ఏ అవయవాలు చెడిపోవని గ్రహించండి.

4) గ్రహణం చూస్తే గర్భిణీ స్త్రీలకు / గర్భంలో ఉన్న శిశివుకు హాని జరిగి మొర్రి (పై పెదవి చీలికలు గా ఉండటం) వస్తుందని అని కొందరు భావిస్తారు ఇది సబబేనా?

ఇలా భావించడం సరియైనది కాదు .దానికి సంబంధం లేదు. అలా  అయితే ఆ సమయంలో ప్రపంచంలో అనేక మంది పిల్లలు పుట్టిన వారందరికీ రావాలిగా....అలా జరగడం లేదుగా ..

అసలు గ్రహణం చూడటం వల్ల సాధారణ మనుషులతో పాటు, గర్భిణీ స్త్రీలకు గానీ, మరి ఏ ఇతర జీవరాశికి గానీ ఎలాంటి ప్రమాదం సంభవించదు..

ఇలాంటి మూఢ నమ్మకాలు విశ్వసించకుండా చంద్రుడి అద్భుతాలు కుటుంబ సభ్యులతో కలిసి చూసి ఆనందించాలి.

కాని మూఢ నమ్మకాల్లో మునిగిపోయి ఇంట్లోనే ఉండకుండా బయటకు    వచ్చి ఈ ఖగోళ ఘట్టాన్ని చూడండి... ఇతరులకు చూపించండి....

"మూఢ నమ్మకాలను వీడండి - శాస్త్రీయంగా ఆలోచించండి - ఆచరించండి"

జన విజ్ఞాన వేదిక తెలంగాణ సౌజన్యంతో...

Read More

Wednesday, January 03, 2018

Mana Kamareddy

మీ మొబైల్ నెంబర్ ని ఆధార్ తో ఇలా ఇంట్లోనుండే సులువుగా లింక్ చేయండి..

మీ మొబైల్ నెంబర్ ను ఆధార్‌తో అనుసంధానం ఇంకా చేయలేదా? అయితే ఈ ఇది మీకోసమే. ఇంతకు ముందులా ఆధార్‌ అనుసంధానానికి రిటైల్‌ స్టోర్లకు పరుగులు పెట్టకుండా సులువుగా ఆధార్‌ అనుసంధానం చేసే పద్ధతిని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో మీ ఇంటి వద్దే మీ మొబైల్‌ నుంచే ఆధార్‌ అనుసంధానం పూర్తిచేయొచ్చు. IVRS పద్ధతిలో ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు.

ఇందు కోసం మీరు మీ ఆధార్‌ నంబర్‌, మొబైల్‌ను కలిగి ఉంటే చాలు. ఎయిర్‌టెల్‌, ఐడియా, జియో, వొడాఫోన్‌ ఇలా ఏ నెట్‌వర్క్‌ కస్టమర్‌ అయినా సరే మీ ఫోన్‌ నుంచి 14546 నెంబర్ను డయల్‌ చేయాల్సి ఉంటుంది.

* తొలుత ఈ ఆ నెంబర్కు డయల్‌ చేయగానే మీరు ఇండియాకు చెందిన వారా లేదా ఎన్నారై కస్టమరా అడుగుతుంది. అందులో ఒక ఐచ్చికాన్ని ఎంపిక చేసుకోవాలి.

* ఆ తర్వాత 1ని ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ ఆధార్‌ నంబర్‌ను పొందుపరిచిన తర్వాత మళ్లీ 1ని నొక్కాలి.

* ఆ తర్వాత మీ మొబైల్‌ నెంబర్కు ఓ వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) వస్తుంది.

* ఆ తర్వాత మీ మొబైల్‌ నెంబర్ను ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ మొబైల్‌ నెంబర్లోని చివరి నాలుగు అంకెలను ధ్రువీకరించాల్సి ఉంటుంది.


* మొబైల్‌ నెంబర్ ధ్రువీకరణ అనంతరం మీ మొబైల్‌కు వచ్చిన (OTP) ఓటీపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత 1ని నొక్కడం ద్వారా మీ ఆధార్‌ నెంబర్ రీ వెరిఫికేషన్‌ను పూర్తిచేయొచ్చు.

* ఒకవేళ మీరు ఇది వరకే ఆధార్‌ అనుసంధానం చేసి ఉంటే ముందుగానే ఆ విషయాన్ని మీకు తెలియజేస్తారు. మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ అర్ధగంటపాటు చెల్లుబాటు అవుతుంది.



Read More

Monday, November 20, 2017

Mana Kamareddy

పవన్ కళ్యాణ్ సినిమాకి చెందిన 'బయటకొచ్చి చూస్తే' జర్మన్ దేశస్థుడు పాడితే...

ఈ మధ్యే విడుదలై దుమ్ము రేపుతున్న పవన్ కళ్యాణ్ సినిమాకి చెందిన 'బయటకొచ్చి చూస్తే' పాటను ౨౨ ఏళ్ళ చేరిస్పెల్ అనే జర్మన్ దేశస్థుడు గిటార్ వాయిస్తూ పాడాడు.  జర్మనీలో తెలుగు విద్యార్థుల రూమ్ మెట్ అయిన చేరిస్పెల్ పాడిన ఈ పాట సోషల్ మీడియాలో పాపులర్ ఇయ్యింది. మీ కోసం ఆ పాట.


Read More

Thursday, November 09, 2017

Mana Kamareddy

మీ కళ్ళకు నీళ్ళు తెప్పించే వీడియో..!

ఈ వీడియో చూస్తే మీ మీ తల్లిదండ్రులపైన, గురువులపైన అమితమైన గౌరవం పెరగటంతో పాటు కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి.


Read More

Monday, August 28, 2017

Mana Kamareddy

ప్రశ్నించడం నేర్చుకుందాం, ఆలోచించడం నేర్చుకుందాం..

మన దేశంలో బాబాలు, ఫకీర్లు, ఇవాంజెలిస్ట్‌లు ఏమి చెయ్యరు. లోక కళ్యాణానికే వారు పాటు పడతారు. అంతే తప్ప సమాజానికి వారి వల్ల, మా నమ్మకాల వల్ల ఎటువంటి హాని లేదు అనే వారికి, ఇదే వాస్తవ చిత్రం.


Read More
Mana Kamareddy

ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి సామాన్య ఎన్ఆర్ఐ అభిమాని లేఖ...


గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ రావు గారికి హ్రుదయపూర్వక నమస్కారములతో,

ఉద్యమనేతగా, మంచి పరిపాలనదక్షుడుగా ఉన్న మీ ద్రుష్టికి ఒక తెలంగాణ పౌరుడిగా, టి.ఆర్.ఎస్ ని అభిమానించే వ్యక్తిగా కొన్ని విషయాలు తీసుకురాదల్చుకున్నాను. దీనిలో ఎమైన తప్పులుంటే పెద్ద మనసుతో క్షమించగలరు.
నిరంతర విద్యుత్,మిషన్ కాకతీయ,మిషన్ భగీరధ, ఆసరా, పల్లె వ్రుత్తులను పటిష్ట పరిచే అనేక కార్యక్రమాలు ఇప్పటికిప్పుడు ఫలితాలు చూపించకపొయిన భవిష్యత్ తెలంగాణ కు రూపురేఖలు మార్చే అవకాశాలు ఎక్కువ. ఈ పథకాల ముందు ఆ తర్వాత ప్రజల జీవన విధానం మీద మనం తప్పకుండ డాక్యుమెంట్ చెసుకొవాలి. ఎంతో కీలక సమయం లో ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన మీరు ఎన్నొ కుట్రలు చేదించి ప్రభుత్వ పథకాలు, సాగునీటి ప్రాజెక్ట్ లకు ఇబ్బందులు కలగకుండ చూసిన్రు.


Read More

Tuesday, July 25, 2017

Mana Kamareddy

తెలంగాణ యాసను బతికించిన ఫిదా సినిమా..


ఈ నెల ఇరవైఒకటో తారీఖున విడుదలై మంచి పేరు తెచ్చుకున్న 'ఫిదా' సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే. ఎందుకంటే గి సినిమా షూటింగ్ తొంభై శాతం మన కామారెడ్డి జిల్లాలో జరగటమే. ప్రధానంగా బాన్స్ వాడ పట్టణంతో పాటు చుట్టుప్రక్కల మండలాలైన బీర్కూర్ , గాంధారి మండలాల్లో షూటింగ్ జరిగింది. సినిమాలో చూపించిన కొన్ని ప్రాంతాలను చూస్తుంటే ఇంత అందమైన ప్రదేశాలు మన జిల్లాలో ఉన్నాయా అని ఆశ్చర్యం వేసింది. అలాగే ఒక పాటలో గాంధారి ప్రాంతంలో నివసించే గిరిజనుల (కోయ లంబాడిల) నృత్యాలను, అక్కడి ప్రాంతాలను చూసిన తర్వాత మనసు  పులకరించింది.



Read More

Thursday, July 13, 2017

Mana Kamareddy

జలీల్ ఖాన్ "బికాం లో ఫిజిక్స్" ని మించిన ఇంటర్వ్యూల వీడియోలు మీ కోసం..

ఆమధ్యలో.. విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఒక ఇంటర్వ్యూ లో బీకామ్ లో ఫిజిక్స్ ఉంటుందని చెప్పి జనాలు నవ్వేలా చేశారు. ఇప్పుడు అదే కోవలో మరికొందరు నాయకులు వాళ్ళ వాళ్ళ విద్యాభ్యాసం గురించి ఎలా చెప్పారో ఈ క్రింది వీడియోలు చూసి నవ్వుకోండి.


Read More

Monday, July 03, 2017

Mana Kamareddy

రేపటి నుండి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జాబ్ మేళా..

మన కామారెడ్డి: తెలంగాణ జాగృతి నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రం నిరుద్యోగ యువతకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నది. తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్తో సహా 15 పట్టణాలలో జులై 4వ తేదీ నుంచి ఆగస్టు 25 వరకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నది.  ఉదయం 10-30 గంటల నుంచి సాయంత్రం 4-30 గంటల వరకు జాబ్ మేళా జరుగుతుంది. టెన్త్ పాస్ అయిన వారు, ఆపై ఉన్నత విద్యార్హత   కలిగిన వారు కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. 


కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) పథకం లో భాగంగా,  తెలంగాణలోని పార్లమెంటు నియోజక వర్గాలలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు తెలంగాణ జాగృతి నైపుణ్య శిక్షణాభివృద్ధి కేంద్రాలు పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేంద్రాలలో శిక్షణ పొందిన నిరుద్యోగ యువతతో పాటు ఇతరులు కూడా జాబ్ మేళాలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. లాజిస్టిక్స్, రిటెయిల్, ఎలక్ట్రానిక్స్, బ్యూటీ అండ్ వెల్నెస్, హోటల్ మేనేజ్మెంట్ రంగాల్లో ఉద్యోగాల నియామకాల కోసం ఆయా రంగాల కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. వీటితోపాటు బిపిఓ, ఎలక్ర్టానిక్స్, అగ్రిబేస్డ్ కంపెనీలు,  ఫార్మసీ సంస్థలు, హోటల్ పరిశ్రమ, బ్యూటీ అండ్ వెల్నెస్, సెక్యూరిటీ  సర్వీసెస్ సంస్థలు జాబ్ మేళాలో పాల్గొంటాయి. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత తమ వెంట లేటెస్ట్ రిజ్యూమ్ తెచ్చుకోవలసి ఉంటుందని తెలంగాణ జాగృతి స్కిల్స్ డెవలప్మెంట్ ట్రయినింగ్ సెంటర్ సిఇఓ అబ్ధుల్ బాసిత్ తెలిపారు. మరిన్ని వివరాలకు హైదరాబాద్ దోమలగూడలోని నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రధాన కార్యాలయంలో వ్యక్తిగతంగా కాని  040-40214215 నెంబర్కు కాల్ చేసి తెలుసుకోవచ్చని  ఆయన తెలిపారు.


Skill development Contact Numbers:

  • Hyd - Ashoknagar – 040 – 40214215,
  • Hyd - Charminar – 040-24410211,
  • Bhongir- 08685244266, 
  • Khammam -08742234215,
  • Mahabubnagar – 08686793145,
  • Mancherial -08736253535,
  • Nirmal- 08734244466,
  • Dilkhuknagar-04024147555,
  • Karimnagar-0878-6515666,
  • Nizamabad-08462240678,
  • Wanaparthy- 09642435228,
  • Zaheerabad-07451280822,
  • Nalgonda- 08682247227,
  • Hanamkonda- 08702554333,
  • Siddipet – 0845723123


Read More

Friday, June 30, 2017

Mana Kamareddy

జిఎస్టీ ప్రభావం కొనుగోలుదారులపై ఎలా ఉంటుందో తెలుసా..!


మన కామారెడ్డి: ఒకే దేశం – ఒకే పన్ను– ఒకే మార్కెట్ అనే కొత్త వ్యవస్థలోకి కొన్ని గంటలలో అడుగుపెడుతున్నాం. మన దేశంలోని ప్రతి మనిషిపై GST ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు వరకు వస్తువుపై విధిస్తున్న పన్ను విధానం మొత్తం సమూలంగా మార్పు చెందబోతోంది. మనం రోజువారీ వాడుకునే వస్తువులలో,  GST మూలంగా ఎంతమేర హెచ్చుతగ్గులుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ...


నిత్యావసర వస్తువులలో సుమారు రకాల రేట్లలో మార్పు వుండబోతోంది ఇలా:

  • టీ పౌడర్ : ప్రస్తుతం : 29%,  GST తర్వాత 18%(తగ్గుతుంది)
  • కాఫీ పౌడర్ : ప్రస్తుతం : 29%, GST తర్వాత 18శాతం (తగ్గుతుంది)
  • చక్కెర : ప్రస్తుతం 10%, GST తర్వాత 5శాతం (తగ్గుతుంది)
  • నెయ్యి : ప్రస్తుతం 5%, GST తర్వాత 12శాతం (పెరుగుతుంది)
  • వెన్న : ప్రస్తుతం 14.5%, GST తర్వాత 12శాతం (తగ్గుతుంది)
  • హెయిర్ ఆయిల్ : ప్రస్తుతం 29%, GST తర్వాత 18శాతం (తగ్గుతుంది)
  • టూత్ పేస్ట్ : ప్రస్తుతం 29%, GST తర్వాత 18శాతం (తగ్గుతుంది)
  • సబ్బులు : ప్రస్తుతం 29%, GST తర్వాత 18శాతం (తగ్గుతుంది)
  • బ్రాండెడ్ రైస్ : ప్రస్తుతం లేదు. GST తర్వాత 5శాతం (పెరుగుతుంది)
  • ( 10కేజీల రైస్ బ్యాగ్ 25రూపాయలు పెరుగుతుంది)

  • చాక్లెట్లు, బిస్కెట్లు : ప్రస్తుతం 29%, GST తర్వాత 18శాతం (తగ్గుతుంది)
  • బర్త్ డే, ఇతర కేకులు : ప్రస్తుతం 29%, GST తర్వాత 18శాతం (తగ్గుతుంది)
  • ఐస్ క్రీమ్స్ : ప్రస్తుతం 29%, GST తర్వాత 18శాతం (తగ్గుతుంది)
  • మొబైల్ ఫోన్స్ : ప్రస్తుతం 6%, GST తర్వాత 12శాతం (పెరుగుతాయి)
  • కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు : ప్రస్తుతం 6%, GST తర్వాత 18శాతం (పెరుగుతాయి)
  • ఫర్నీచర్ : ప్రస్తుతం 29%, GST తర్వాత 12శాతం (తగ్గుతాయి)
  • ఆయుర్వేద మందులు : ప్రస్తుతం 10%, GST తర్వాత 12శాతం (పెరుగుతాయి)
  • బ్రాండెడ్ నూడుల్స్ : ఒక శాతం పెరుగుతున్నాయి.
  • కూల్ డ్రింక్స్ : ఒకశాతం పెరుగుతున్నాయి.
  • పిజ్జా, బర్గర్స్ : మూడు శాతం తగ్గుతున్నాయి. ప్రస్తుతం రూ.100 ఉంటే.. GST తర్వాత రూ.97 అవుతుంది.
చెప్పులు, బూట్లు ధరల్లో మార్పులు ఇలా :
  • రూ.1000 పైన : ప్రస్తుతం 26.5%, GST తర్వాత 18శాతం (తగ్గుతాయి)
  • రూ.500-1000 మధ్య ఉంటే : ప్రస్తుతం 20.5%, GST తర్వాత 18శాతం (తగ్గుతాయి)
  • రూ.500లోపు ఉంటే : ప్రస్తుతం 5%, GST తర్వాత 5శాతం (మార్పు లేదు)
రెడీమేడ్ దుస్తులు ధరల్లో మార్పులు ఇలా :
  • రూ.1000పైన కొనుగోలు చేస్తే : ప్రస్తుతం 12%, GST తర్వాత 4.5శాతం (తగ్గుతాయి)
  • రూ.1000లోపు కొనుగోలు చేస్తే : ప్రస్తుతం 5%, GST తర్వాత 2.5శాతం (తగ్గుతాయి)
  • టీవీలు : ప్రస్తుతం 26%, GST తర్వాత 28శాతం (పెరుగుతాయి)
  • వాషింగ్ మెషీన్ : ప్రస్తుతం 26%, GST తర్వాత 28శాతం (పెరుగుతుంది)
  • ఫ్రిడ్జ్ : ప్రస్తుతం 26%, GST తర్వాత 28శాతం (పెరుగుతుంది)
  • మెక్రోఓవెన్ : ప్రస్తుతం 26%, GST తర్వాత 28శాతం (పెరుగుతుంది)
  • వైద్య పరికరాలు : ప్రస్తుతం 18%, GST తర్వాత 12శాతం (తగ్గుతాయి)
  • సిమెంట్ : ప్రస్తుతం 29%, GST తర్వాత 28శాతం (తగ్గుతుంది)
  • పెద్ద వాహనాలు (కమర్షియల్) : ప్రస్తుతం 30%, GST తర్వాత 28శాతం (తగ్గుతాయి)
  • SUV కార్లు : ప్రస్తుతం 55%, GST తర్వాత 43శాతం (తగ్గతాయి)
  • లగ్జరీ కార్లు : ప్రస్తుతం 49%, GST తర్వాత 43శాతం (తగ్గుతాయి)
  • మీడియం కార్లు : ప్రస్తుతం 47%, GST తర్వాత 43శాతం (తగ్గుతాయి)
  • చిన్నకార్లు : ప్రస్తుతం 30%, GST తర్వాత 29శాతం (తగ్గుతాయి)
  • బైక్స్ : ప్రస్తుతం 30%, GST తర్వాత 28శాతం (తగ్గుతాయి)







Read More

Tuesday, June 20, 2017

Mana Kamareddy

దోమకొండ సంస్థానం చరిత్ర..


మన కామారెడ్డి: తెలంగాణలో వున్న సుప్రసిద్ధ 294 చారిత్రాత్మక కట్టడాలలో ఒకటైన దోమకొండ కోట కామారెడ్డి జిల్లాలో నెలకొని ఉంది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సుమారు ఇరవై కిమీల దూరంలో, అలాగే 44వ నెంబర్ జాతీయ రహదారికి పక్కనే ఉన్న తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగనాణానికి (బిటిఎస్, భిక్కనూరు) కి ఐదు కిమీ ల దూరంలో ఉంటుంది. క్లిక్ చేసి దోమకొండ కోట సంబంధించిన ఫోటో గ్యాలరీ చూడండి.


Read More

Sunday, June 18, 2017

Mana Kamareddy

నాన్నకు ప్రేమతో...


నేను...నాన్న

నాకు కొత్త డ్రస్సు వచ్చింది
నాన్న బనీను చిరుగులు
మరింత పెద్దవయ్యాయి

నాకు కొత్త బూట్ల జత వచ్చింది
నాన్న అరిగిపోయిన చెప్పులు
దీనంగా చూస్తున్నాయి

నాకు కొత్త బైకు వచ్చింది
నాన్న డొక్కు సైకిల్
కళతప్పి పక్కన నిల్చుంది

నాకు ఫీజు కట్టేసిన రిసీటందింది
ఎక్కడో అప్పుకై నాన్న చేయి
చాచబడింది...తల దించబడింది..

నెల మొదటి తేదీన కొత్త నోట్లతో
జీతం చేతికందింది
ఎప్పటిదో నాన్న చెమటనంటిన
పాతనోటు వాసనేసింది..

అందమైన ఆనందాలు నిండిన
జీవితం నా సొంతమయ్యింది
కరిగిపోయీ...అరిగిపోయీ
చితికిపోయీ...నాన్న జీవితం
శిథిలమయ్యింది..

అయినా నాకంటే
నాన్న కళ్ళళ్ళోనే విజయోత్సాహం
ఎందుకంటే
నేను నా జీవితాన్ని సాధిస్తే
నాన్న నన్ను సృష్టించాడు
నా జీవితాన్ని తీర్చిదిద్దాడు

నాన్న ఒక త్యాగి... ఒక యోగి
నా బ్రతుకులో వెలుగులు నింపేందుకు
తననంతా.... తన తనువంతా
కరిగించుకున్న ఓ కొవ్వొత్తి..


Read More
Mana Kamareddy

మంత్రి నారాయణ కొడుక్కి ఒక నీతి..శిరీషకి ఒక నీతా...!


రెండు ప్రపంచాలు
నారాయణ కొడుకు అర్ధరాత్రి దాకా ఎక్కడ ఎందుకు వున్నాడో చూచాయగా కూడా తెలియనివ్వరు. ముందు కార్లలో ఎవరెవరు వెళ్తున్నారో కూడా తెలియదు. వాళ్ళ తాగుడు గురించి ఒక్క వార్త కూడా ఉండదు. కనీసం ప్రజలకు ఆ ఊహ కూడా కలగనివ్వరు. ప్రమాదానికి ముందు ఫోన్లలో ఎవెరెవరు ఏమేమి మాట్లాడుకున్నారో కూడా ఒక్క ముక్క కూడా రాదు. వాళ్ళ WhatsApp మెసెంజర్లలో ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు.

అప్పుడొక ఘోర విషాదం జరిగినట్టు, రాకుమారుడు అర్ధాంతరంగా మరణించినట్టు బాధ. వాళ్ళ కుటుంబాలకు ఏ మాత్రం ఇబ్బంది, embarrassment, అవమానం కలుగకూడదు. పరువుకు భంగం కలగకూడదు.
పత్రికలకు, ఛానెళ్లకు ఆ విషయాలు అప్పుడు ప్రస్తుతం.

కానీ ఇప్పుడు minute-by-minute ఏం జరిగిందో పత్రికల నిండా, చానెళ్ల నిండా చూపిస్తున్నారు. అక్రమ సంబంధాలు, ట్విస్టులు, నేరపూరిత విలాసజీవితాల కోసం వెంపర్లాడిన మనుషులు. పోలీసులు, చానెళ్లు ప్రత్యక్ష సాక్షుల వలె వివరిస్తున్నారు. వర్ణిస్తున్నారు. Scene ని కళ్ళకు కట్టినట్టు reconstruct చేసి చూపిస్తున్నారు. ఆమెకి, ఆమె కుటుంబానికి అసలు privacy అవసరం లేదు. వాళ్లకు embarrassment కలిగినా పర్వాలేదు.

లేకపోతే మృతురాలు శిరీష బిడ్డ దగ్గరికి వెళ్లి మీ అమ్మ ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడేదా అని తల్లి ని పోగొట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ చిట్టి తల్లిని అడిగితే ఆ బిడ్డ ఏం చెప్తది..?? ఇంతకన్నా ఘోరం ఉంటుందా...??

మీడియా మిత్రులారా, జనాలను ఇలా బాధపెడుతూ..బాధతో సగం చచ్చిన వాళ్ళని మొత్తం చంపేయొద్దు సుమా..


Read More

Friday, April 14, 2017

Mana Kamareddy

రాత్రి పూట ప్రపంచం ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడండి..

రాత్రి పూట ప్రపంచ దేశాలు ఎలా కనబడుతాయో తెలుపటానికి అమెరికా అంతరిక్షకేంద్రం నాసా ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఈ వీడియోతో పాటు గత సంవత్సరంలో విడుదల చేసిన వీడియోను గమనిస్తే ప్రపంచంలోని కొన్ని దేశాలతో పాటు, ముఖ్యంగా మన దేశంలో జరిగిన మార్పులు చూడవచ్చు.



Read More

Monday, April 03, 2017

Mana Kamareddy

దుబాయ్ లో కొత్త చట్టాలు రాబోతున్నాయి..జాగ్రత్త!!

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త కొత్త చట్టాలను చేస్తూ అభివృద్ధిలో దూసుకుపోతోంది యూఏఈ. వలసదారుల విషయంలో కాస్త కఠినంగానే వ్యవహరిస్తోంది. విదేశాల నుంచి వచ్చి అక్రమాలు చేయకుండా కట్టుదిట్టమైన చట్టాలకు రూపకల్పన చేసింది. దీనిలో భాగంగా ఇటీవల కొన్ని చట్టాలను యూఏఈ ఆమోదించింది. ఆ చట్టాలను వలసదారులు ఎవరైనా అతిక్రమిస్తే తిప్పలు తప్పవని చెప్పకనే చెప్పింది. మరి ఆ చట్టాలేవో తెలుసుకుంటే.. తెలియని తప్పులకు ప్రవాసులు శిక్ష అనుభవించకుండా ఉంటారు. 

ఫోన్‌కాల్ రికార్డ్ చేయొద్దు..
ఇతరులతో ఫోన్ మాట్లాడేటపుడు వారి సంభాషణలను రికార్డు అసలే చేయొద్దు. ఫోన్ కాల్ రికార్డింగ్ కోసం యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలిస్తే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. అవతలి వ్యక్తి అనుమతి లేకుండా రికార్డింగ్ చేస్తే కఠినమైన శిక్షలు విధిస్తామని అధికారులు చెబుతున్నారు. ఓ వ్యక్తి వ్యక్తిగత విషయాలపై సోషల్ మీడియా వేదికగా కామెంట్స్, ఫోటోలు పెట్టడం, పిచ్చి పిచ్చి వార్తలు ప్రచారం చేయడం వంటివి కూడా శిక్షార్హమే. 


స్పీడు ఎక్కువైతే జైలుకే
వలసదారులకు కూడా దుబాయిలో డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తున్నారు కదా అని ఎక్సలేటర్‌పై కాలు పెట్టి రయ్యిమంటూ దూసుకెళ్తే.. అటు నుంచి అటే జైలు గోడల్లోకి వెళ్తారు. యూఏఈలోని ట్రాఫిక్ చట్టాలను క్షుణ్ణంగా తెలుసుకుని మాత్రమే డ్రైవింగ్ చేయాలి. రెడ్ సిగ్నల్ దాటితే 800 దిర్హమ్స్ జరిమానాతోపాటు 15 రోజుల పాటు వాహనాన్ని పోలీసుల దగ్గరే పెట్టుకుంటారు. గంటకు 60 కిలోమీటర్ల వేగానికి మించితే 1000 దిర్హమ్స్‌ను జరిమానాగా చెల్లించాలి. అంతేకాకుండా 30 రోజుల పాటు వాహనం మీ చేతుల్లోకి రానట్లే. 

వీసా లేకుంటే వర్క్ చేయొద్దు
వీసా లేకుండా యూఏఈలోకి అడుగుపెట్టడం, దేశంలో పనిచేయడం వంటివి అక్రమం మాత్రమే కాదు.. నేరపూరితం కూడా. వర్క్ వీసా ఉంటేనే పనిచేయాల్సి ఉంటుంది. ఏదో ఒక వీసాపై దేశంలోకి వచ్చి పని చేస్తానంటే అక్కడ కుదరదు. ఉద్యోగాన్ని సంపాదించి, కంపెనీతో అన్ని వివరాలు మాట్లాడుకుని మళ్లీ స్వదేశం వెళ్లి.. కంపెనీ వర్క్ వీసాకు దరఖాస్తు చేసుకుని మాత్రమే దేశంలోకి అడుగుపెట్టాలి. పని చేయాలి. 

వేసుకునే దుస్తుల విషయంలో..
సౌదీలో కూడా మహిళలకు దుస్తుల విషయంలో కఠిన నిబంధనలు ఉన్నాయనీ, డ్రస్‌కోడ్ గురించి వీసాపై సంతకం పెట్టించుకుంటారనేవి అపోహలు మాత్రమే. కాకుంటే ఆ దేశ సంప్రదాయాలకు అనుగుణంగా దుస్తులను ధరించాల్సి ఉంటుంది. ప్రార్థన మందిరాలు, షాపింగ్ మాల్స్, హోటల్స్ వంటి చోట్ల దేశ సంప్రదాయానికి విరుద్ధంగా దుస్తులు ధరించకూడదు.

ఏది ఏమైనా మన ప్రాంతం నుండి పనిచేయటానికి దుబాయ్ లాంటి దేశాలకు వెతున్న నిరుద్యోగ యువకులారా.. జర భద్రం.. 



Read More